iDreamPost
android-app
ios-app

అధికారం కోసం కన్నతండ్రినే హత్య.. ఈ పొలిటికల్ డ్రామాకి నోరెళ్లబెట్టాల్సిందే!

  • Published Jun 11, 2024 | 10:11 PM Updated Updated Jun 11, 2024 | 10:11 PM

OTT Suggestions- Best Political Drama: ఓటీటీలో ఒక అద్భుతమైన పొలిటికల్ డ్రామా అందుబాటులో ఉంది. ఈ సిరీస్ చూస్తే మాత్రం మీరు నిజంగానే ఫిదా అయిపోతారు. అరె ఇంత మంచి సిరీస్ ని మిస్ అయ్యామా అంటూ బేజార్ అయిపోతారు.

OTT Suggestions- Best Political Drama: ఓటీటీలో ఒక అద్భుతమైన పొలిటికల్ డ్రామా అందుబాటులో ఉంది. ఈ సిరీస్ చూస్తే మాత్రం మీరు నిజంగానే ఫిదా అయిపోతారు. అరె ఇంత మంచి సిరీస్ ని మిస్ అయ్యామా అంటూ బేజార్ అయిపోతారు.

  • Published Jun 11, 2024 | 10:11 PMUpdated Jun 11, 2024 | 10:11 PM
అధికారం కోసం కన్నతండ్రినే హత్య.. ఈ పొలిటికల్ డ్రామాకి నోరెళ్లబెట్టాల్సిందే!

వెబ్ సిరీస్లు చూడాలి అంటే కాస్త ఓపిక కావాలి. అలాగే సమయం కూడా కావాలి. ఎందుకంటే కొన్ని సిరీస్లు స్టార్ట్ చేస్తే అస్సలు ఆపలేరు. అలాంటి ఒక బెస్ట్ పొలిటికల్ డ్రామా వెబ్ సిరీస్ ని మీకోసం తీసుకొచ్చాం. ముందే చెప్తున్నాం.. ఈ సిరీస్ ని స్టార్ట్ చేస్తే ఆపడం మాత్రం చాలా కష్టం. ప్రతి సీన్, ప్రతి ఎపిసోడ్, ప్రతి ట్విస్టుకు మీ బుర్ర గిర్రున తిరుగుతుంది. అరె ఇలాంటి వెబ్ సిరీస్ ఇన్నాళ్లు మిస్ అయ్యామా? బాధ పడతారు కూడా. ఈ సిరీస్ మొత్తం ఒక కుటుంబం, ఒక రాష్ట్రం, అందులో పరిపాలన, అధికార దాహం అనే పాయింట్స్ బేస్ చేసుకుని నడుస్తూ ఉంటుంది. ఇప్పటికే మీకు ఒక క్లారిటీ వచ్చేసి ఉండాలి. ఇది ఎలా ఉంటుందో అని.

ఇప్పుడు చెప్పుకుంటున్న వెబ్ సిరీస్ అంత ప్రత్యేకం ఎందుకంటే రాజకీయంగా ఎంతో నాటకీయ పరిణామాలను జోడించవచ్చు. అంతేకాకుండా కథలో ఎంతో డ్రామాని చూపించవచ్చు. అంతేకాకుండా.. వెబ్ సిరీస్ కాబట్టి కావాల్సినంత సమయం తీసుకుని కథని ఎస్టాబ్లిష్ చేయచ్చు. అదే ఈ సిరీస్ మేకర్స్ కూడా చేశారు. ఇది మొత్తం 3 సీజన్స్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఒక సీజన్ చూశారు అంటే మీరు.. మిగిలిన రెండు సీజన్స్ కూడా కంప్లీట్ చేసేస్తారు. అంత అద్భుతంగా ఉండే పొలిటికల్ డ్రామా ఇది. ఇందులో ఇంకో ట్విస్టు ఏంటంటే.. ఇందులో కథ మొత్తం ఒక కుటుంబం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.

ఒక రాష్ట్రంలో అధికారం కోసం సొంత వాళ్లనే హత్యలు కూడా చేస్తారు. కన్న తండ్రిని చంపించే కుమార్తె ఒకరు అయితే.. అధికారం కోసం మనవడినే చంపించిన తాత ఒకరు. మరొకరు సొంత తమ్ముడిని కూడా కైలాసానికి పంపేస్తుంది. ఇలాంటి ఎంతో మంది క్రూరమైన మనస్తత్వాలు, అధికారం దాహం కలిగిన అడవి జంతువుల్లాంటి మనుషుల మధ్య జరిగే ఎన్నో నాటకీయ పరిణామాలతో ఈ వెబ్ సిరీస్ నడుస్తూ ఉంటుంది. ఇది కథ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అంతేకాకుండా ఈ సిరీస్లో మీకు వచ్చే ట్విస్టులు మిమ్మల్ని ముక్కున వేలేసుకునేలా చేస్తాయి. కాసేపటికి ఒక ట్విస్టు వస్తూ మీ అటెన్షన్ డైవర్ట్ కాకుండా చేస్తుంటాయి. ఇది హాట్ స్టార్ స్పెషల్స్ సిరీస్. అంటే కచ్చితంగా అద్భుతంగానే ఉంటుంది. ఈ సిరీస్ పేరు ‘సిటీ ఆఫ్ డ్రీమ్స్’. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మీకు ఈ సిరీస్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మీరు ఇప్పటికే ఈ సిరీస్ చూసుంటే మాత్రం మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş