iDreamPost
android-app
ios-app

OTTలో ఒక సైకో పిల్ల.. కొట్టడం- చంపడం అంటే భలే ఇష్టం..!

OTT Suggestions- Best Horror Web Series: ఓటీటీల్లో మీరు ఇప్పటివరకు చూసిన హార్రర్ వెబ్ సిరీస్లు అన్నీ ఒకెత్తు.. ఈ వెబ్ సిరీస్ ఒకెత్తు. ఇందులో ఉండే అమ్మాయి ప్రవర్తన చూస్తే పిచ్చెక్కిపోతారు.

OTT Suggestions- Best Horror Web Series: ఓటీటీల్లో మీరు ఇప్పటివరకు చూసిన హార్రర్ వెబ్ సిరీస్లు అన్నీ ఒకెత్తు.. ఈ వెబ్ సిరీస్ ఒకెత్తు. ఇందులో ఉండే అమ్మాయి ప్రవర్తన చూస్తే పిచ్చెక్కిపోతారు.

OTTలో ఒక సైకో పిల్ల.. కొట్టడం- చంపడం అంటే భలే ఇష్టం..!

చాలామందికి మిస్టరీ థ్రిల్లర్స్ అంటే ఇష్టం ఉంటుంది. ఇంకొంత మందికి అడ్వెంచరస్ అంటే ఇష్టం. మరికొతం మంది మాత్రం ఈ దెయ్యాలు, బూతాలు, అతీత శక్తులకు సంబంధించిన స్టోరీస్ అంటే చెవి కోసేసుకుంటారు. అలాంటి వారి కోసం ఒక అద్భుతమైన, కాస్త భయంకరమైన ఒక సైకో పిల్లను తీసుకొచ్చాం. ఇది సినిమా కాదు. ఇదొక వెబ్ సిరీస్. ఈ సిరీస్ ని మీరు చూస్తే మాత్రం ఆ పిల్ల యాక్టింగ్ కి పిచ్చోళ్లు అయిపోతారు. మరి.. ఆ సైకో పిల్ల ఎవరు? అసలు ఆ వెబ్ సిరీస్ ఏది? నిజంగానే అంత అద్భుతంగా.. భయానకంగా ఉంటుందా? అనేది చూద్దాం.

ఇది కాస్త విచిత్రమైన వెబ్ సిరీస్ అనే చెప్పాలి. సాధారణంగా మీరు చూసే సిరీస్లకు కాస్త భిన్నంగా ఉంటుంది. కానీ, చాలా కొత్తగా ఉంటుంది. మీరు ఈ సిరీస్ గురించి దాదాపుగా వినే ఉండచ్చు. కానీ, అంతగా మీకు తెలియకపోవచ్చు. ఒక అమ్మాయి ఉంటుంది. తాను ఎవ్వరితో స్నేహం చేయదు. ఎవరూ తనతో స్నేహం చేసేందుకు ధైర్యం చేయరు. స్కూల్లో కూడా ఎంతో వింతగా ప్రవర్తిసూ ఉంటుంది. ఐదేళ్లలో ఐదు స్కూల్స్ మారిపోతుంది. తన సోదరుడిని ఏడిపించారని.. స్విమ్మింగ్ పూల్ లో పిరానా చేపలు వదిలి.. తోటి స్టూడెంట్స్ ని బెదరగొట్టేస్తుంది. ఆఖరికి తనని చేర్పించడానికి స్కూల్స్ కూడా ఉండవు.

అయితే తన ప్రవర్తన గురించి తెలిసిన తల్లిదండ్రులు.. ఆ అమ్మాయిని ఒక అతీంద్రియ శక్తులు కలిగి ఉండే పిల్లలున్న స్కూల్ కి తీసుకెళ్తారు. అక్కడ కూడా ఈ అమ్మాయి ప్రవర్తన మారదు. కాకపోతే అక్కడ అంతా ఈ అమ్మాయిలాగానే ఉంటారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ స్కూల్ ఈమెకు బాగా నచ్చుతుంది. తాను ఏది అనుకుంటే అక్కడ అది చేసేయచ్చు. అంతేకాకుండా.. పైకి కనిపించేది మాత్రమే కాదు ఆ స్కూల్లో చాలానే రహస్యాలు ఉంటాయి. వాటిని ఛేదించడమే ఈమె పనిగా పెట్టుకుంటుంది.

అంతేకాకుండా తనలో దాగున్న వైలెన్స్ ని కూడా నిద్రలేపుతుంది. అలాగే ఆ స్కూల్లో ఉండే ఒక వింత జీవిని వేటాడాలి అని ఫిక్స్ అవుతుంది. రాత్రులు వచ్చి కనిపించిన వారిని హత్య చేసే ఆ జంతువు వెనుక ఈ అమ్మాయి పడుతుంది. అంతేకాకుండా.. తాను చేసే పనులతో చాలానే ఇబ్బందుల్లో పడుతుంది. ఈ వెబ్ సిరీస్ పేరు ‘Wednesday’. ఇది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. మీరు ఇప్పటికే ఈ సిరీస్ గనుక చూసుంటే.. ఆ అమ్మాయి వైలెన్స్ మీకు ఎంత నచ్చిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişRoyalbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetcasibomMadridbetHoliganbet GirişGrandpashabet Giriş