iDreamPost

దీపావళికి సినిమా పండుగ… OTTలో ఒకేసారి 23 సినిమాలు!

సాధారణంగా పండుగల సీజన్ కి మూవీ మేకర్స్ తమ సినిమాలు పోటీ పడీ మరీ రిలీజ్ చేస్తుంటారు. ఇటీవల ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై కూడా ఇలాంటి పోటీ నెలకొంటుంది. దీపావళి సందర్భంగా ఓటీటీలో వరుస సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.

సాధారణంగా పండుగల సీజన్ కి మూవీ మేకర్స్ తమ సినిమాలు పోటీ పడీ మరీ రిలీజ్ చేస్తుంటారు. ఇటీవల ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై కూడా ఇలాంటి పోటీ నెలకొంటుంది. దీపావళి సందర్భంగా ఓటీటీలో వరుస సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.

దీపావళికి సినిమా పండుగ… OTTలో ఒకేసారి 23 సినిమాలు!

ఇటీవల చాలా మంది థియేటర్లో తాము చూడాలని అనుకున్న సినిమాలు మిస్ అయితే.. ఓటీటీలో చూస్తున్నారు. సాధారణంగా వీక్ ఎండ్ వచ్చిందంటే చాలు ఫ్యామిలీతో కలిసి థియేటర్లలో ఎంజాయ్ చేస్తుంటారు. మూవీ మేకర్స్ కూడా పండుగల సందర్భంగా తమ సినిమాలు రిలీజ్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. చాలా మంది ప్రేక్షకులు కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు థియేటర్లలో చూడలేకపోయిన హాయిగా ఇంట్లో ఓటీటీలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వారాంతం వచ్చిందంటే చాలు ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ లు రిలీజ్ కోసం ప్లాన్ చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే దీపావళి పండుగ సందర్భంగా వరుస సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

టెక్నాలజీ పెరిగిపోయింది.. ఒకప్పుడు థియేటర్లలో సినిమాలు చూడాలంటే ముందుగా బుక్ చేసుకోవడం, లేదా టికెట్ తీసుకొని ఫ్యామిలీతో థియేటర్లో కూర్చొని ఎంజాయ్ చేసేవాళ్లు. కానీ కాలం మారిపోయింది.. ఇప్పుడు ఇంట్లో స్మార్ట్ టీవీ, ఇంటర్ నెట్ ఉంటే చాలు కొత్త కొత్త సినిమాలు మన కళ్ల ముందు ఆవిష్కరించబడుతున్నాయి. కరోనా తర్వాత మూవీ మేకర్స్ ఎక్కువగా తమ సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. వీకెండ్, స్పెషల్ డేస్, పండుగల సందర్భంగా ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ లు రిలీజ్ చేయడాకి ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీపావళి పండుగ సందర్భంగా వరుస సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైతున్నాయి. ఆ సినిమాలు ఏంటీ? ఏ రోజు.. ఏ సినిమా.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందీ? అన్న విషయం గురించి తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్న మూవీస్, వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే..

  • రెయిన్ బో రిష్టా ( ఇంగ్లీష్ డాక్యూ సీరీస్) – నవంబర్ 7వ తేదీన స్ట్రీమింగ్
  • బీటీఎస్ : ఎట్ టూ కమ్ (కొరియన్ మూవీ) – నవంబర్ 9వ తేదీన స్ట్రీమింగ్
  • దీనా హశేం : డార్క్ లిటిల్ విస్పర్స్ (షో), పిప్పా (బాలీవుడ్ మూవీ), 007: రోడ్ ఎ మిలియన్ ( గేమ్ షో) –  నవంబర్ 10వ తేదీన స్ట్రీమింగ్

హాట్‌స్టార్‌ స్ట్రీమింగ్ కానున్న మూవీస్, వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే..

  • విజిలాంటి (కొరియన్ వెబ్ సీరీస్), ది శాంటా క్లాస్ (వెబ్ సీరీస్, సెకండ్ సీజన్) – నవంబర్ 8వ తేదీన స్ట్రీమింగ్
  • లేబుల్ (తెలుగు వెబ్ సీరీస్) – నవంబర్ 10వ తేదీన స్ట్రీమింగ్

నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్ కానున్న మూవీస్, వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే..

  • రిక్‌ అండ్‌ మార్టీ సీజన్‌ 7, ఇరుగుపట్రు(తమిళ మూవీ) – నవంబర్ 6వ తేదీన స్ట్రీమింగ్
  • ఎస్కేపింగ్‌ ట్విన్‌ ఫ్లేమ్స్‌(వెబ్‌ సిరీస్‌), సైబర్‌ బంకర్‌: ద క్రిమినల్‌ అండర్‌వరల్డ్‌ (డాక్యుమెంటరీ), రాబీ విలియమ్స్‌ (వెబ్‌ సిరీస్‌), ద క్లాస్‌ ఫ్యామిలీ 3 – నవంబర్ 8వ తేదీన స్ట్రీమింగ్
  • అకుమా కున్‌ (యానిమేషన్‌ సిరీస్‌) – నవంబర్ 9వ తేదీన స్ట్రీమింగ్
  • ది కిల్లర్‌ (హాలీవుడ్‌), ఎట్‌ ద మూమెంట్‌ (వెబ్‌ సిరీస్‌), ఫేమ్‌ ఆఫ్టర్‌ ఫేమ్‌ (సిరీస్‌)- నవంబర్ 10వ తేదీన స్ట్రీమింగ్

జీ5 లో స్ట్రీమింగ్ కానున్న మూవీస్, వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే..

  • ఘూమర్‌ (బాలీవుడ్ మూవీ) – నవంబర్ 10వ తేదీన స్ట్రీమింగ్

బుక్‌ మై షో లో స్ట్రీమింగ్ కానున్న మూవీస్

  •  యు హర్ట్‌ మై ఫీలింగ్స్‌ (హాలీవుడ్‌ మూవీ), ది రాత్‌ ఆఫ్‌ బెక్కీ (హాలీవుడ్‌ మూవీ) – నవంబర్ 7వ తేదీన స్ట్రీమింగ్
  • ది అడల్ట్స్‌ (హాలీవుడ్‌ మూవీ) – నవంబర్ 10వ తేదీన స్ట్రీమింగ్

ఆపిల్‌ టీవీ ప్లస్‌ :

  • ద బుకనీర్స్‌ – నవంబర్ 8వ తేదీన స్ట్రీమింగ్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి