iDreamPost
android-app
ios-app

OTTలోకి మంజుమ్మెల్ బాయ్స్ లేడీ వర్షన్ మూవీ.. అమ్మాయిలంతా గుహలో..

OTT Releases- Manjummel Boys Lady Version: ఓటీటీలో చాలామంది ఇటీవలి కాలంలో చూసిన చిత్రాల్లో మంజుమ్మెల్ బాయ్స్ కూడా ఒకటి. అయితే అలాంటి ఒక కథతో లేడీ వర్షన్ తో ఒక మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది.

OTT Releases- Manjummel Boys Lady Version: ఓటీటీలో చాలామంది ఇటీవలి కాలంలో చూసిన చిత్రాల్లో మంజుమ్మెల్ బాయ్స్ కూడా ఒకటి. అయితే అలాంటి ఒక కథతో లేడీ వర్షన్ తో ఒక మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది.

OTTలోకి మంజుమ్మెల్ బాయ్స్ లేడీ వర్షన్ మూవీ.. అమ్మాయిలంతా గుహలో..

కొన్ని సినిమాలను అంత ఈజీగా మర్చిపోలేం. అవి మన మైండ్ లో క్రియేట్ చేసే ఇంపాక్ట్ అలా ఉంటుంది. ఈ మధ్యకాలంలో అలాంటి ఒక సినిమా ఏదైనా ఉంది అంటే అది మంజుమ్మెల్ బాయ్స్ అని చెప్పచ్చు. ఎందుకంటే మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ స్మాల్ బడ్జెట్ మూవీ.. బిగ్ నంబర్స్ ని చూపించింది. అంతేకాకుండా పాన్ ఇండియా లెవల్లో ఒక మార్క్ ని క్రియేట్ చేసింది. అంతా ఇప్పటికీ ఈ మంజుమ్మెల్ బాయ్స్ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు అంటే మీరే అర్థం చేసుకోవాలి. తెలుగు ప్రేక్షకులు కూడా దాదాపుగా ఈ మూవీని చూసేశారు. అయితే ఈ మంజుమ్మెల్ బాయ్స్ తరహాలోనే ఒక లేడీ వర్షన్ మూవీ వస్తోందని మీకు తెలుసా?

మంజుమ్మెల్ బాయ్స్ అనే కోలీవుడ్ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతో అలరించింది. అందరూ ఈ మంజుమ్మెల్ బాయ్స్ మూవీని థియేటర్లలోనే కాకుండా.. ఓటీటీలో కూడా చూసేశారు. అటు బాక్సాఫీస్ కలెక్షన్స్ మాత్రమే కాకుండా.. ఇటు ఓటీటీ రికార్డులు కూడా క్రియేట్ చేసింది. అందరికీ ఈ మూవీ ఎందుకు నచ్చింది అంటే.. ఇందులో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అవేంటంటే.. కామెడీ, ఫ్రెండ్ షిప్, సర్వైవల్, ఫైటింగ్ అనే ఎమోషన్స్ ఉన్నాయి. అవి సగటు ప్రేక్షకుడికి బాగా నచ్చేశాయి. ఈ మూవీ చూసి చాలామంది ఏడ్చేశారు కూడా. అయితే ఇప్పుడు మంజుమ్మెల్ బాయ్స్ కి లేడీ వర్షన్ ఒకటి ఓటీటీలోకి రాబోతోంది.

ఓటీటీలోకి ఇప్పటికే చాలా రకాల సినిమాలు వచ్చాయి. వస్తూనే ఉంటాయి. కానీ, కొన్ని సినిమాల కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అవి వారి మదిలో అలాంటి ఒక ముద్ర వేశాయి కాబట్టి. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మంజుమ్మెల్ బాయ్స్ లాంటి ఒక హాలీవుడ్ మిస్టరీ డ్రామా ఒకటి ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇది కూడా అచ్చం మంజుమ్మెల్ బాయ్స్ తరహాలోనే ఉండే ఒక మూవీ. కాకపోతే అక్కడ ఫ్రెండ్స్ తమ స్నేహితుడి ప్రాణం కోసం పోరాడారు. కానీ, ఇక్కడ ఫ్రెండ్స్ మాత్రం వారిలో ఒక అమ్మాయిని చంపేశారు. అది కూడా హై స్కూల్ రోజుల్లోనే. ఆ తర్వాత ఆ విషయాన్ని బాహ్య ప్రపంచానికి తెలియకుండా దాచేశారు.

ఈ కథ ఏడుగురు అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వాళ్లంతా ఒకసారి టూర్ కి వెళ్తే.. అక్కడ వారిలో ఒక అమ్మాయి ప్రాణాలు పోతాయి. అయితే చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఆ విషయం బయటకు వస్తుంది. అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? ఆమెను నిజంగానే ఎవరైనా హత్య చేశారా? అన్నేళ్ల తర్వాత ఎందుకు ఆ విషయం బయటకు వచ్చింది అనేదే ఈ సినిమా స్టోరీ. ఈ మూవీ పేరు ‘పాస్ట్ లైస్’. ఈ చిత్రం మే 24 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ మూవీ తెలుగులో వస్తుందా లేదా? అనేది మాత్రం క్లారిటీ రాలేదు. మరి.. ఓటీటీలోకి వస్తున్న మంజుమ్మెల్ బాయ్స్ లేడీ వర్షన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomivermectin tabletMadridbetMadridbetPokerklasmeritbetCasibom GirişmeritbetpokerklasBetvolemarsbahis giriş