iDreamPost

OTTలో ఈ వీకెండ్ ఈ 3 మూవీస్ స్పెషల్.. అస్సలు మిస్ కావొద్దు!

OTT Weekend Movie Suggessions: ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 21 సినిమాలకు పైగా విడుదల అవుతున్నాయి. అయితే అవన్నీ చూడలేరు కాబట్టి.. ఈ 3 మూవీస్ మాత్రం మిస్ కావొద్దు.

OTT Weekend Movie Suggessions: ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 21 సినిమాలకు పైగా విడుదల అవుతున్నాయి. అయితే అవన్నీ చూడలేరు కాబట్టి.. ఈ 3 మూవీస్ మాత్రం మిస్ కావొద్దు.

OTTలో ఈ వీకెండ్ ఈ 3 మూవీస్ స్పెషల్.. అస్సలు మిస్ కావొద్దు!

ప్రస్తుతం అందరూ ఓటీటీ సనిమాలకే ఎక్కువ ప్రధాన్యత ఇస్తున్నారు. థియేటర్లలోకి ఏ సినిమాలు వచ్చినా వెళ్లినా పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ, ఓటీటీల్లోకి ఏ సినిమాలు వస్తున్నాయి? వాటిలో మనం ఏ మూవీస్ చూడచ్చు అనే విషయాలపై మాత్రం ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. కానీ, ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. అదేంటంటే.. వారానికి 10 నుంచి 20 సినిమాలు రిలీజ్ అవుతాయి. వాటిలో అన్నింటిని మనం చూడలేం. అందులోనూ ఏ సినిమాలు చూడాలో కూడా తెలీదు. ఈ వారం కూడా ఓటీటీలోకి 21 సినిమాలు వస్తున్నాయి. మరి.. వాటిలో ఏ మూవీస్ చూస్తారు? క్లారిటీ లేదు కదా.. అందుకే మీకోసం ఈ వీకెండ్ రిలీజెస్ లో 5 బెస్ట్ సినిమాలను సజెస్ట్ చేస్తున్నాం. అవేంటో చూసేయండి…

నా సామిరంగా:

కింగ్ నాగార్జున, అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ లీడ్ రోల్స్ లో.. సంక్రాంతి కానుగా వచ్చిన చిత్రమే నా సామిరంగా. ఈ మూవీ సంక్రాంతి రేసులో దిగడమే కాకుండా.. మంచి ఫలితాన్నే అందుకుంది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, లవ్ స్టోరీతో ఈ మూవీని తెరకెక్కించారు. ప్రేక్షకుల నుంచి మంచి టాక్ రావడం మాత్రమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ నే రాబట్టింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతుందా అని తెలుగు ఓటీటీ లవర్స్ ఎదురుచూశారు. వాళ్లు కోరుకున్నట్లుగానే ఈ వీకెండ్ కి నా సామిరంగా ఓటీటీలో స్ట్రీమ్ కాబోతోంది. ఫిబ్రవరి 17 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో ఈ చిత్రం రికార్డులు సృష్టిస్తుందని ఆకాంక్షిస్తున్నారు.

భామాకలాపం 2:

ప్రియమణి, సీరత్ కపూర్, శరణ్య ప్రధాన పాత్రలో ఈ భామాకలాపం 2 చిత్రం రాబోతోంది. ఇప్పటికే భామాకలాపం 1కి భారీ స్పందన లభించింది. ఈ మూవీ ఒక సాధారణ హౌస్ వైఫ్ నేపథ్యంలో సాగుతూ ఉంటుంది. అనవసరపు విషయాల్లో తల దూరిస్తే.. ఎంత ప్రమాదమో ఈ సినిమాలో చూడచ్చు. నిజానికి పార్ట్ 1తో పోలిస్తే.. ఈ భామాకలాపం 2 సినిమాని ఎంతో ఆసక్తిగా తెరకెక్కించారు. ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే పార్ట్ 2 కూడా సూపర్ సక్సెస్ సాధిస్తుందని తెలుస్తోంది. పైగా స్టోరీని మరింత ఆసక్తిగా మార్చారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ భామాకలాపం 2 చిత్రం ఫిబ్రవరి 16 నుంచి ఆహా ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

ది కేరళ స్టోరీ:

ది కేరళ స్టోరీ సినిమా దేశవ్యాప్తంగా సృష్టించిన ప్రకంపనల గురించి ఎవరికీ ప్రత్యేకం చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ మూవీ అనౌన్స్ మెంట్ నుంచి రిలీజ్ వరకు ఏదో ఒక విషయం మీద రచ్చ జరుగుతూనే వచ్చింది. ఎట్టకేలకు ఈ మూవీని రిలీజ్ చేశారు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. రూ.20కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే.. రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అందరూ ఎదురు చూశారు. కానీ, ఇది ఓటీటీలోకి రావడానికి కూడా చాలానే ఇబ్బందులు ఎదురయ్యాయి. దాదాపు 9 నెలల తర్వాత ది కేరళ స్టోరీస్ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో ఫిబ్రవరి 16 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. మరి.. ఈ వీకెండ్ కి ఈ మూడు మూవీస్ చూసేసి ఆనందంగా గడిపేయండి. ఈ మూడు చిత్రాల్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏదో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి