iDreamPost
android-app
ios-app

OTT Best Romantic Movie: OTT లో హెబ్బా పటేల్ రొ*మాంటిక్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ.. దీనిని మీరు చూశారా !

  • Published Jun 25, 2024 | 1:14 PM Updated Updated Jun 25, 2024 | 6:29 PM

OTT Best Romantic Movie: ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చే సినిమాలని ప్రేక్షకులు ఎలాగూ చూస్తూనే ఉంటున్నారు. మరి ఆల్రెడీ ఉన్న సినిమాల సంగతేంటి. వాటిలో కూడా ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలంటి ఓ మంచి సినిమానే. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

OTT Best Romantic Movie: ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చే సినిమాలని ప్రేక్షకులు ఎలాగూ చూస్తూనే ఉంటున్నారు. మరి ఆల్రెడీ ఉన్న సినిమాల సంగతేంటి. వాటిలో కూడా ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలంటి ఓ మంచి సినిమానే. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

  • Published Jun 25, 2024 | 1:14 PMUpdated Jun 25, 2024 | 6:29 PM
OTT Best Romantic Movie: OTT లో హెబ్బా పటేల్  రొ*మాంటిక్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ..  దీనిని మీరు చూశారా !

ఇప్పుడు తెలుగు సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. వారం వారం ఓటీటీ లో చాలానే సినిమాలు రిలీజ్ అయినా కూడా వాటిలో తెలుగు సినిమాలు ఏమేం ఉన్నాయా అని సెర్చ్ చేస్తూనే ఉంటారు. వాటికే ముందు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దీనితో మేకర్స్ ఈ మధ్య ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగానే .. కొత్త కొత్త సినిమాలను , సిరీస్ లను తెలుగులోనే తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన రెండు వెబ్ సిరీస్ లు ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు చెప్పుకునేది కూడా ఇలాంటి ఓ తెలుగు సినిమా గురించే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. చూసేద్దాం.

ఈ సినిమాలో నటి నటులు దాదాపు అందరికి తెలిసిన వారే.. ఈ మూవీలో హీరోయిన్ గా హెబ్బా పటేల్ నటించగా.. హీరోగా దినేష్ తేజ్ నటించాడు. ఇక వీరిద్దరితో పాటు.. ఈ సినిమాలో నటి పాయల్ రాధాకృష్ణ ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమా పేరు “అలా నిన్ను చేరి”. ఈ సినిమాకు మరేష్ శివన్ డైరెక్ట్ చేశారు. అయితే ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు మాత్రం అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీనితో ప్రేక్షకులు అంతగా ఈ సినిమాను పట్టించుకోలేదు. ఇక ఓటీటీ లో కూడా ఈ సినిమా ఎటువంటి సందేహం లేకుండా సైలెంట్ గా స్ట్రీమింగ్ అయిపొయింది. ఇప్పటికే అప్పుడప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ సోషల్ మీడియాలో చూసే ఉంటారు. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

Hebbah Patel

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఇది చాలా సింపుల్ కథ. ఓ చిన్న గ్రామంలో బాగా ధనవంతుల కుటుంబానికి చెందిన పాయల్.. దినేష్ తేజ్ తో ప్రేమలో పడుతుంది. దీనితో వెంటనే దివ్యకు వేరే పెళ్లి చేయాలనీ.. ఆమె అమ్మ నిర్ణయిస్తుంది. దీనితో ఆమె ఇంటి నుంచి పారిపోయి .. దినేష్ ను పెళ్ళి చేసుకుందాం అని అనుకుంటుంది. ఇదే విషయాన్నీ అతనితో కూడా చెప్తుంది. కానీ దినేష్ మాత్రం ఎందుకో కాస్త ఆలోచిస్తాడు. ఎందుకంటే అతను ఓ మంచి ఫిల్మ్ డైరెక్టర్ కావాలనేది అతని లక్ష్యం. ఇదిలా కొనసాగుతుండగా.. అతనికి హెబ్బా పటేల్ పరిచయం అవుతుంది. ఈ క్రమంలో హెబ్బా పటేల్ రాక .. దినేష్, పాయల్ ప్రేమ కథలో ఎలాంటి మలుపులు తిప్పింది! వీరి ప్రేమ కథ చివరికి ఏమైంది ! డైరెక్టర్ కావాలన్నా అతని కల నెరవేరిందా లేదా ! చివరికి కథ ఎలా ముగిసింది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా మిస్ చేసి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.