iDreamPost
android-app
ios-app

OTT లోకి తెలుగులోకి వచ్చేసిన పిల్ల దెయ్యం సినిమా ‘ముంజ్యా’

  • Published Sep 22, 2024 | 3:10 PM Updated Updated Sep 22, 2024 | 3:10 PM

OTT Telugu Horror Movie - Munjya :కాస్త ఆలస్యం అయినా కానీ కొన్ని సినిమాలు తెలుగులోకి వచ్చి తీరాల్సిందే . ఈ వారం ఓటీటీ తెలుగు సినిమాల లిస్ట్ లోకి ఎంచక్కా ఈ మూవీని కూడా యాడ్ చేసుకోవచ్చు. మరి ఆ మూవీ ఏంటో చూసేద్దాం..

OTT Telugu Horror Movie - Munjya :కాస్త ఆలస్యం అయినా కానీ కొన్ని సినిమాలు తెలుగులోకి వచ్చి తీరాల్సిందే . ఈ వారం ఓటీటీ తెలుగు సినిమాల లిస్ట్ లోకి ఎంచక్కా ఈ మూవీని కూడా యాడ్ చేసుకోవచ్చు. మరి ఆ మూవీ ఏంటో చూసేద్దాం..

  • Published Sep 22, 2024 | 3:10 PMUpdated Sep 22, 2024 | 3:10 PM
OTT లోకి తెలుగులోకి వచ్చేసిన పిల్ల దెయ్యం సినిమా ‘ముంజ్యా’

ఇప్పుడిప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ కు విపరీతమైన క్రేజ్ పెరుగుతుంది. అందులోను తెలుగు సినిమాలకు మరింత క్రేజ్ పెరుగుతుంది. ఈ క్రమంలో థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలతో పాటు .. నేరుగా ఓటీటీ లో రిలీజ్ అయ్యే తెలుగు సినిమాల సంఖ్య కూడా బాగానే పెరుగుతుంది. అయితే ఈ రెండు కాకుండా మొదట కొన్ని సినిమాలను ఒరిజినల్ లాంగ్వేజ్ లో రిలీజ్ చేసినా కానీ… ఆ తర్వాత మాత్రం వాటిని తెలుగులో కూడా అందుబాటులోకి తీసుకుని వస్తున్నారు . ఈ క్రమంలో ఈ వీకెండ్ వచ్చిన తెలుగు సినిమాలతో పాటు.. మరొక ఇంట్రెస్టింగ్ హర్రర్ మూవీ తెలుగులోకి రాబోతుంది. అది మరేదో కాదు.. థియేటర్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసిన ముంజ్యా మూవీ..మరి ఈ మూవీ తెలుగు వెర్షన్ ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

ఆదిత్య సర్పోదర్ డైరెక్ట్ చేసిన ముంజ్యా మూవీ.. జూన్ 7న థియేటర్ లో అడుగుపెట్టింది. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా ఊహించని విధంగా రూ.132 కోట్లు వసూళ్లు చేసింది. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది .. అయితే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కంటే ముందే..ఆగస్టు 24 నుంచి టీవీ ప్రీమియర్స్ కు వచ్చేసింది . ఇక ఆ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చినా కానీ… తెలుగు వెర్షన్ మాత్రం రాలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా వచ్చేసింది. ఇది కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోనే స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి ఈ వీకెండ్ ఓ మంచి హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలంటే మాత్రం ఈ సినిమా బెస్ట్ ఛాయస్. కాబట్టి ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే కనుక వెంటనే చూసేయండి.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ముంజ్యా అనేది మరాఠీ భాషకు చెందిన పదం.. ముంజ్యా అంటే ఉపనయనం అనే అర్ధం వస్తుంది. సాధారణంగా హిందూ సంప్రదాయంలో ఉండే మగపిల్లలకు కౌమార దశలో వేదాభ్యాసానికి ముందు..ఇలా ఉపనయనం చేయడాన్ని మరాఠిలో ముంజ్యా అని పిలుస్తారు. ఇలా ఉపనయనం చేస్తున్న క్రమంలో ఓ పిల్లవాడు దెయ్యంగా మారిపోతాడు. అయితే ఈ దెయ్యం కేవలం పిల్లలకు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఈ పిల్ల దెయ్యం ఓ వైపు భయపెడుతూనే.. మరో వైపు నవ్విస్తూ ఉంటుంది. ఇక ఈ సినిమాలో హీరోకు మాత్రమే ఈ పిల్ల దెయ్యం కనిపిస్తుంది. ఆ తర్వాత హీరోకు ఈ పిల్ల దెయ్యంతో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనేదే మిగిలిన కథ. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet