iDreamPost

Oscar: ఆస్కార్ అవార్డుల్లో మార్పు.. ఆ విభాగంలో కొత్త అవార్డు

ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల్లో మార్పు చోటుచేసుకుంది. ఓ కొత్త విభాగాన్ని అవార్డుల కేటగిరీలో చేర్చినట్లు అకాడమీ పేర్కొంది. మరి ఆ కొత్త విభాగం ఏది? ఆ వివరాలు..

ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల్లో మార్పు చోటుచేసుకుంది. ఓ కొత్త విభాగాన్ని అవార్డుల కేటగిరీలో చేర్చినట్లు అకాడమీ పేర్కొంది. మరి ఆ కొత్త విభాగం ఏది? ఆ వివరాలు..

Oscar: ఆస్కార్ అవార్డుల్లో మార్పు.. ఆ విభాగంలో కొత్త అవార్డు

ఆస్కార్.. తమ సినీ కెరీర్ లో ఒక్కసారైనా ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును ముద్దాడాలని కలలు కంటూ ఉంటారు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు. ప్రస్తుతం 23 విగాభాల్లో ఆస్కార్ అవార్డులను ప్రధానం చేస్తుండగా.. తాజాగా ఓ కొత్త కేటగిరీ ఇందులో చేరనుంది. దీంతో అవార్డులు అందించే సంఖ్య 24 విభాగాలకు చేరింది. మరి ఆస్కార్ లోకి చేరిన ఆ కొత్త విభాగం ఏది? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆస్కార్ అవార్డుల్లో మార్పులు చోటుచేసుకున్నట్లు అకాడమీ వెల్లడించింది. ఇప్పటి వరకు 23 కేటగిరీల్లో అవార్డులు అందిస్తుండగా.. తాజాగా మరో కొత్త విభాగం ఇందులో చేరింది. దీంతో 24కు చేరింది ఆస్కార్ అవార్డులు అందించే కేటగిరీల సంఖ్య. కొత్తగా ‘క్యాస్టింగ్ డైరెక్టర్స్’ అనే విభాగాన్ని చేర్చినట్లు అకాడమీ అధ్యక్షుడు జానెట్ యంగ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ బిల్ క్రామెర్ తెలిపారు. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. ఈ సంవత్సరం మార్చి 10న జరగనున్న 96వ ఆస్కార్ అవార్డుల్లో కానీ, 2025లో జరిగే 97వ అవార్డుల్లో గానీ క్యాస్టింగ్ డైరెక్టర్స్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు ప్రధానం చేయరు. 2026లో జరిగే 98వ అకాడమీ అవార్డ్స్ లో ఈ విభాగానికి అవార్డును ప్రధానం చేస్తారు. దీంతో 2025లో విడుదల అయ్యే సినిమాలకు క్యాస్టింగ్ డైరెక్టర్స్ 98వ ఆస్కార్ అవార్డ్స్ కోసం నామినేట్ అవుతారు.

సందర్భంగా అకాడమీ అధ్యక్షుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ..”ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో, ఫిల్మ్ మేకింగ్ విభాగంలో క్యాస్టింగ్ డైరెక్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇప్పుడు వారిని ఇందులో భాగం చేయడం సంతోషంగానూ, గర్వంగానూ ఉంది. క్యాస్టింగ్ డైరెక్టర్స్ ఆస్కార్ అవార్డు అనేది మా కృషికి గుర్తింపుగా భావిస్తున్నాం” అంటూ చెప్పుకొచ్చారు. కాగా.. అకాడమీకి ధన్యవాదాలు తెలిపింది క్యాస్టింగ్ డైరెక్టర్ బ్రాంచ్. ఇదిలా ఉండగా.. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆస్కార్ అవార్డులకు సంబంధించి కేటగిరీలో మార్పు జరిగింది. గతంలో 2001లో బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ ను చేర్చారని హాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆస్కార్ అవార్డుల్లో కొత్త కేటగిరీ చేర్చడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: శ్రీలీల రేర్ వీడియో చూశారా..? క్లాసికల్ డ్యాన్సును అదరగొట్టింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి