iDreamPost
android-app
ios-app

Sundeep Kishan: ఊరు పేరు భైరవకోనకి మంచి హైప్ తెచ్చిన ‘హరోం హర’ పాట

  • Published Feb 11, 2024 | 11:11 AM Updated Updated Feb 11, 2024 | 11:11 AM

యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవకోన చిత్రం నుండి తాజాగా 'హరోం హర' అనే కొత్త పాటను విడుదల చేశారు. ఆ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవకోన చిత్రం నుండి తాజాగా 'హరోం హర' అనే కొత్త పాటను విడుదల చేశారు. ఆ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

  • Published Feb 11, 2024 | 11:11 AMUpdated Feb 11, 2024 | 11:11 AM
Sundeep Kishan: ఊరు పేరు భైరవకోనకి మంచి హైప్ తెచ్చిన ‘హరోం హర’ పాట

యువ నటుడు సందీప్ కిషన్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఊరు పేరు భైరవకోన చిత్రం ఫిబ్రవరి 16న  ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సూపర్ నేచురల్, ఫాంటసీ ఎలిమెంట్స్ తో పాటు హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ, భక్తి కోణాలు కూడా ఈ సినిమాలో ఉండబోతున్నాయి. ఇటివలి కాలంలో ఫాంటసీ జానర్ సినిమాలని ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతుండటంతో ఈ సినిమాకి టాక్ వస్తే భారీ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

కాగా ఊరు పేరు భైరవకోన చిత్రం నుండి తాజాగా ‘హరోం హర’ అనే కొత్త పాటను విడుదల చేశారు. టైటిల్ కి తగ్గట్టు గానే ఇది ఒక ఆధ్యాత్మికతతో నిండిన పాట. శేఖర్ చంద్ర స్వరపరిచిన ఈ పాట ఆకట్టుకునే కంపోజిషన్, అద్భుతమైన గానంతో అలరించింది. సింగర్ చైతూ సత్సంగి కూడా ఈ పాటకు లిరిక్స్ అందించారు. ఆడియోలోనే ఇలా ఉంటే ఇక సినిమాలో కంప్లీట్ విజువల్స్ తో ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. సినిమాలోని ఓ కీలక ఘట్టంలో ఈ పాట వస్తుందని తెలుస్తోంది. ఈ సినిమా పోస్టర్లు, టీజర్, ట్రైలర్ చూసి కొందరు విరూపాక్ష సినిమాని గుర్తు చేసుకున్నారు. రెండు సినిమాలకి ఎలాంటి సంబంధం లేదని హీరో సందీప్ కిషన్ ఇటీవలి ఇంటర్వ్యూలో వివరించారు.

ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత అనిల్ సుంకర సమర్పణలో హస్య మూవీస్ పతాకం పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా కావ్య థాపర్ ఒక ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో వచ్చే ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని, అలానే ఆ సర్ప్రైజ్ ని ఎవరూ కూడా ఊహించలేరని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. ఇక తామందరం ఎంతో కష్టపడ్డ ఊరు పేరు భైరవకోన సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుందనే నమ్మకాన్ని చిత్ర నిర్మాతలు వ్యక్తం చేసారు.

ఇదికూడా చదవండి: దర్శకుడు త్రినాథరావు నక్కిన పై విమర్శలు