iDreamPost

యంగ్ టైగర్ ఆప్షన్లు ఇద్దరేనా

యంగ్ టైగర్ ఆప్షన్లు ఇద్దరేనా

అరవింద సమేత వీర రాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వెండితెర దర్శనం లేకపోవడంతో అభిమానుల బాధ అంతాఇంతా కాదు. మూడేళ్ళ వ్యవధి చాలా పెద్దది కావడం వల్ల ఆర్ఆర్ఆర్ మీదే గంపెడాశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. అది చూస్తేనేమో అలా వాయిదాల మీద వాయిదాలతో కోర్టు తీర్పులాగా పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. రామ్ చరణ్ కైనా ఆచార్య రూపంలో ముందే వచ్చే ఛాన్స్ ఉంది కానీ తారక్ కు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. అందుకే జెమిని ఛానల్ త్వరలో ప్రసారం చేయబోయే ఎవరు మీలో కోటీశ్వరుడు మీద గంపెడాశలు పెట్టుకుని ఫ్యాన్స్ వెయిట్ చేస్తన్నారు. ఇప్పటికే ప్రోమోకు బాగా ఆకట్టుకున్నాయి.

ఇక విషయానికి వస్తే కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ చేయబోయే సినిమా తాలూకు క్యాస్టింగ్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. పాన్ ఇండియా మేకింగ్ కాబట్టి బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకునే ప్లాన్ లో ఉన్నాడు దర్శకుడు. ఇక్కడ రెండు ఆప్షన్లు పెట్టుకున్నారట. ఒకటి కియారా అద్వానీ. రెండు అలియా భట్. సంప్రదింపులు మొదలయ్యాయి కానీ వీళ్ళలో ఎవరు ఓకే అవుతారో ఇంకా చెప్పలేని పరిస్థితి. ఇద్దరూ తమ తమ ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉండటంతో కాల్ షీట్స్ ఎన్ని అవసరం అవుతాయనే దాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి. కియారా ఆల్రెడీ రామ్ చరణ్-శంకర్ ల సినిమాకు కమిట్ అవ్వడంతో దీనికి ఓకే అంటుందో లేదో

అసలు ముందు కొరటాల శివ ఫ్రీ అవ్వాలి. ఆచార్య ఇంకా రెండు పాటలు బాలన్స్ ఉంది. ఒకటి చిరంజీవి రామ్ చరణ్ ల మీద షూట్ చేయాలి. దీంతో పాటు కొన్ని సీన్లు పెండింగ్ ఉన్నాయి. ఎంతలేదన్నా ఆర్ఆర్ఆర్ కోసం ఉక్రెయిన్ వెళ్లిన చరణ్ తిరిగి వచ్చాక ఆచార్యకు రెండు వారాలకు పైగానే డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు చిరు లూసిఫర్ రీమేక్ కు, చెర్రీ శంకర్ మూవీకి డేట్స్ కేటాయించారు. ఈ ఒత్తిడి చాలదన్నట్టు అక్టోబర్ లో ఆచార్య రిలీజ్ చేసే ప్లానింగ్ కూడా ఉందట. సో జూనియర్ ఎన్టీఆర్ స్టార్ట్ కావాలంటే కొరటాల శివ ముందు దీన్నుంచి బయట పడాలి. ఆ తర్వాతే ఏదైనా అనేలా ఉంది సిచువేషన్

 Also Read : రివెంజ్ ఫార్ములాతో శ్రీదేవి ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి