iDreamPost

పోలీస్ ఉద్యోగం మీ లక్ష్యమా? ఇంటర్ పాసైతే చాలు.. 1,526 పోలీస్‌ Jobs రెడీ

పోలీస్ జాబ్ మీ కలనా? పోలీస్ జాబ్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారా? అయితే మీరు ఇంటర్ పాసైతే చాలు 1526 పోలీస్ జాబ్స్ రెడీగా ఉన్నాయి. ఈ జాబ్స్ ను అస్సలు వదలకండి.

పోలీస్ జాబ్ మీ కలనా? పోలీస్ జాబ్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారా? అయితే మీరు ఇంటర్ పాసైతే చాలు 1526 పోలీస్ జాబ్స్ రెడీగా ఉన్నాయి. ఈ జాబ్స్ ను అస్సలు వదలకండి.

పోలీస్ ఉద్యోగం మీ లక్ష్యమా? ఇంటర్ పాసైతే చాలు.. 1,526 పోలీస్‌ Jobs రెడీ

పోలీస్ ఉద్యోగాలకు వేలాది మంది యువత పోటీపడుతుంటారు. చిన్నప్పటి నుంచే పోలీస్ అవ్వాలనే లక్ష్యాన్ని ఏర్పర్చుకుని తీవ్రంగా కృషి చేస్తుంటారు. పోలీస్ జాబ్స్ సాధిస్తే.. సమాజంలో గౌరవ మార్యాదలతో పాటు మంచి వేతనంతో జీవితంలో స్థిరపడిపోవచ్చు. అందుకే పోలీస్ జాబ్స్ కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అటు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి పోలీస్ జాబ్స్ భర్తీ కోసం నోటిఫికేషన్లు వస్తున్నాయి. మరి మీరు పోలీస్ జాబ్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటే ఈ అవకాశాన్ని వదులుకోకండి. తాజాగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 1,526 పోలీస్‌ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.

మీరు ఇంటర్ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నారా? అయితే మీకోసం వందలాది పోలీస్ ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. బీఎస్ఎఫ్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, సీఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ, ఏఆర్‌)లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్‌, వారెంట్ ఆఫీసర్, హవల్దార్ (క్లర్క్) ఖాళీల భర్తీకి షార్ట్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి స్థాయి నోటిఫికేషన్ త్వరలో వెలువడనున్నది. అస్సాం రైఫిల్ ఎగ్జామినేషన్-2024 ద్వారా ఖాళీలు భర్తీ చేయనున్నారు. అర్హులైన పురుష/ మహిళా అభ్యర్థులు ఆన్‌ లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. జూన్ 09 నుంచి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమై జులై 8వ తేదీతో ముగియనున్నది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం ఖాళీలు : 1526

విభాగాల వారీగా ఖాళీలు:

హెడ్ కానిస్టేబుల్ (హెచ్‌సీ) (మినిస్టీరియల్/ కంబాటెంట్ మినిస్టీరియల్), హవల్దార్ (క్లర్క్): 1,283 పోస్టులు

అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఏఎస్సై)- (స్టెనోగ్రాఫర్/ కంబాటెంట్ స్టెనోగ్రాఫర్), వారెంట్ ఆఫీసర్ (పర్సనల్‌ అసిస్టెంట్‌): 243 పోస్టులు

అర్హత:

అభ్యర్థులు పోస్టులను అనుసరించి ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు టైపింగ్, స్టెనోగ్రఫీ సర్టిఫికెట్‌, నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

ఎంపిక విధానం:

రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

ఆన్‌ లైన్

దరఖాస్తులు ప్రారంభ తేదీ:

09-06-2024

దరఖాస్తులకు చివరి తేదీ:

08-07-2024

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి