iDreamPost
android-app
ios-app

అప్లై చేసుకుంటే చాలు.. రాత పరీక్ష లేకుండానే రైల్వేలో 1,113 ఉద్యోగాలు రెడీ

రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీలాంటి వారికి గుడ్ న్యూస్. రాత పరీక్ష లేకుండానే రైల్వేలో 1,113 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీలాంటి వారికి గుడ్ న్యూస్. రాత పరీక్ష లేకుండానే రైల్వేలో 1,113 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

అప్లై చేసుకుంటే చాలు.. రాత పరీక్ష లేకుండానే రైల్వేలో 1,113 ఉద్యోగాలు రెడీ

అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన భారతీయ రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. అవసరమైన సిబ్బందికోసం నియామకాలను చేపడుతూనే ఉంటుంది. మరి మీరు కూడా రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లైతే ఇదే మంచి సమయం. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే రైల్వేలో ఉద్యోగం సాధించే అవకాశం వచ్చింది. మీరు అప్లై చేసుకుంటే చాలు వద్దన్నా మీ చేతిలో జాబ్ ఉన్నట్టే. ఇటీవల సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 1,113 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మరి ఈ ఉద్యోగాలను మిస్ చేసుకోవద్దనుకుంటే వెంటనే అప్లై చేసుకోండి.

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 2023-24 సంవత్సరానికి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అప్రెంటిస్ వెబ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మే 01 2024 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ ఉద్యోగాలకు మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

  • ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల సంఖ్య:
  • 1,113

డివిజన్ల వారీగా ఖాళీలు:

1) డీఆర్‌ఎం ఆఫీస్, రాయ్‌పూర్ డివిజన్:

  • 844 పోస్టులు
  • వెల్డర్(గ్యాస్ & ఎలక్ట్రిక్)- 161
  • టర్నర్- 54
  • ఫిట్టర్- 207
  • ఎలక్ట్రీషియన్
  • స్టెనోగ్రాఫర్(ఇంగ్లిష్)
  • స్టెనోగ్రాఫర్(హిందీ)
  • కంప్యూటర్ ఆపరేటర్ అండ్‌ ప్రోగ్రామ్ అసిస్టెంట్
  • హెల్త్ అండ్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్
  • మెషినిస్ట్- 15
  • మెకానిక్ డీజిల్- 81
  • మెషిన్ రిఫ్రిజిరేటర్ అండ్‌ ఎయిర్ కండీషనర్
  • మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్

2) వాగన్ రిపేర్ షాప్-రాయ్‌పూర్‌:

  • 269 పోస్టులు
  • ఫిట్టర్- 110
  • వెల్డర్- 110
  • మెషినిస్ట్- 15
  • టర్నర్- 14
  • ఎలక్ట్రీషియన్- 14
  • కంప్యూటర్ ఆపరేటర్ అండ్‌ ప్రోగ్రామ్ అసిస్టెంట్- 04
  • స్టెనోగ్రాఫర్(ఇంగ్లిష్)- 01
  • స్టెనోగ్రాఫర్(హిందీ)- 01

అర్హత:

  • కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • 02.04.2024 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

ఎంపిక విధానం:

  • మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా.

దరఖాస్తు ప్రారంభ తేదీ:

  • 02-04-2024.

దరఖాస్తుకు చివరితేదీ:

  • 01-05-2024.

Jojobet Girişivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetbetvoleKingroyal girişcasibomgalabetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobetMatadorbetMeritking