iDreamPost

లక్కీ ఛాన్స్.. ఈ అర్హతలు ఉంటే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు రెడీ

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి ఇదే మంచి అవకాశం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వెంటనే అప్లై చేసుకోండి.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి ఇదే మంచి అవకాశం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వెంటనే అప్లై చేసుకోండి.

లక్కీ ఛాన్స్.. ఈ అర్హతలు ఉంటే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు రెడీ

ప్రభుత్వ ఉద్యోగాలకు కాంపిటీషన్ ఓ రేంజ్ లో ఉంటుంది. అలా అని ప్రయత్నం చేయకుండా ఉంటామా? ప్రయత్నమే మొదటి విజయం. అంకితభావంతో లక్ష్యం వైపు సాగితే గవర్నమెంట్ జాబ్ సాధించి లైఫ్ లో సెట్ అయి పోవచ్చు. జీవితంలో అదృష్టం ప్రతీసారి తలుపు తట్టదు. అందుకే వచ్చిన అవకాశాన్ని వదులుకుని లైఫ్ అంతా బాధ పడకూడదు. తాజాగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో మెడికల్ ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ అర్హతలు ఉన్నట్లైతే ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఏ అర్హతలు ఉండాలి? వయోపరిమితి ఎంత? పూర్తి వివరాలు మీకోసం..

కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి నిత్యం ఏదో ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఈ క్రమంలో మెడికల్ ఆఫీసర్ల నియామకానికి సంబంధించిన కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్-2024 నోటిఫికేషన్‌ను యూపీఎస్సీ ఏప్రిల్ 10న విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 827 పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

ఖాళీల సంఖ్య:

  • 827

మెడికల్ ఆఫీసర్స్ గ్రేడ్:

  • 163

విభాగం:

  • జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ సబ్-క్యాడర్ ఆఫ్ సెంట్రల్ హెల్త్ సర్వీస్

అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్:

  • 450

విభాగం:

  • రైల్వే.

జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్:

  • 14

విభాగం:

  • న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్.

జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (గ్రేడ్-2):

  • 200

విభాగం:

  • ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్.

అర్హత:

  • అభ్యర్థులు ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి:

  • 01.08.2024 నాటికి అభ్యర్థుల వయసు 32 సంవత్సరాలకు మించకూడదు.

దరఖాస్తు ఫీజు:

  • దరఖాస్తు ఫీజు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌లైన్

ఎంపిక విధానం:

  • రాతపరీక్ష, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 10-04-2024.

దరఖాస్తుకు చివరితేది:

  • 30-04-2024.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి