iDreamPost

APలో పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు.. నెలకు రూ. 98,400 జీతం.. అర్హులు వీరే!

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురును అందించింది. పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హులు ఎవరంటే?

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురును అందించింది. పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హులు ఎవరంటే?

APలో పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు.. నెలకు రూ. 98,400 జీతం.. అర్హులు వీరే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. వరుస నోటిఫికేషన్స్ విడుదల చేస్తూ నిరుద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గ్రూప్ 2, గ్రూప్ 1 నోటిఫికేషన్లను విడుదల చేసింది జగన్ సర్కార్. వీటికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆశావాహులకు తీపి కబురందించింది. ఏపీ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీనికి సబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 99 లెక్చరర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఏపీపీఎస్సీ కోరింది. దరఖాస్తులకు చివరి తేదీని ఫిబ్రవరి 18 2024 గా నిర్ణయించింది. అభ్యర్థులు ఫిబ్రవరి 18 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోదలిచిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారికి వెబ్ సైట్ https://psc.ap.gov.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

  • మొత్తం పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు
  • 99

విభాగాలవారీగా పోస్టులు:

  • ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్ 01 పోస్టు, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ 08 పోస్టులు, బయోమెడికల్ ఇంజినీరింగ్ 02 పోస్టులు, కమర్షియల్ & కంప్యూటర్ ప్రాక్టీస్ 12 పోస్టులు, సిరామిక్ టెక్నాలజీ 01 పోస్టు, కెమిస్ట్రీ 08 పోస్టులు, సివిల్ ఇంజినీరింగ్ 15 పోస్టులు, కంప్యూటర్ ఇంజినీరింగ్ 08 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 10 పోస్టులు, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 02 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ 01 పోస్టు, ఇంగ్లిష్ 04 పోస్టులు, గార్మెంట్ టెక్నాలజీ 01 పోస్టు, జియోలజీ 01 పోస్టు, మ్యాథమెటిక్స్: 04 పోస్టులు, మెకానికల్ ఇంజినీరింగ్ 06 పోస్టులు, మెటలర్జికల్ ఇంజినీరింగ్ 01 పోస్టు, మైనింగ్ ఇంజినీరింగ్ 04 పోస్టులు, ఫార్మసీ 03 పోస్టులు, ఫిజిక్స్ 04 పోస్టులు, టెక్స్‌టైల్ టెక్నాలజీ 03 పోస్టులు ఉన్నాయి.

అర్హతలు:

  • పోస్టులననుసరించి సంబంధిత విభాగంలో అభ్యర్థులు డిగ్రీ, పీజీ, ఫార్మసీ, మాస్టర్స్ డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • 01.07.2023 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులకు కేటగిరీల వారీగా వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్థులు అప్టికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

జీతం:

  • రూ.56,100 – రూ.98,400 ఇస్తారు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 29-01-2024.

దరఖాస్తుకు చివరితేది:

  • 18-02-2024.

ఏపీపీఎస్సీ అధికారికి వెబ్ సైట్:

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి