iDreamPost

AP హైకోర్టులో ఉద్యోగాలు.. నెలకు రూ.1,36,520 వరకు జీతం.. అర్హతలేంటంటే?

ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కొత్త ఏడాది సరికొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఎంపకైతే నెలకు రూ.1,36,520 వరకు జీతం అందుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అర్హతలు ఏంటంటే?

ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కొత్త ఏడాది సరికొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఎంపకైతే నెలకు రూ.1,36,520 వరకు జీతం అందుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అర్హతలు ఏంటంటే?

AP హైకోర్టులో ఉద్యోగాలు.. నెలకు రూ.1,36,520 వరకు జీతం.. అర్హతలేంటంటే?

పండగ వేళ ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఏపీ నుంచి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే రాష్ట్రంలో వరుస నోటిఫికేషన్స్ విడుదలవుతుండగా వాటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రభుత్వం పలు శాఖల్లోని ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ స్టేట్‌ జ్యుడీషియల్‌ సర్వీసులో సివిల్‌ జడ్జి(జూనియర్‌ డివిజన్‌) పోస్టుల భర్తీకి అమరావతిలోని ఏపీ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 39 ఖాళీలను భర్తీచేయనున్నారు. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌, ట్రాన్స్‌ఫర్‌ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీచేయనున్నారు. అభ్యర్థులు ఆన్‌ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 1 2024 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధికారిక వెబ్ సైట్ https://aphc.gov.in/ ను పరిశీలించాలి.

ముఖ్యమైన సమాచారం:

సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌) పోస్టులు

పోస్టుల సంఖ్య:

  • 39

డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌

  • 32

ట్రాన్స్‌ఫర్‌

  • 07

అర్హత:

  • అభ్యర్థులు బ్యాచిలర్స్ డిగ్రీ(లా) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • 01.01.2025 నాటికి అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలకు మించకూడదు.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.77,840 – రూ.1,36,520 అందిస్తారు.

అప్లికేషన్ ఫీజు:

  • అప్లికేషన్ ఫీజు రూ.1500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.750 చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం:

  • స్క్రీనింగ్ టెస్ట్ (సీబీటీ), రాతపరీక్ష, వైవా-వాయిస్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తులు ప్రారంభం:

  • 31-01-2024.

దరఖాస్తుకు చివరితేది:

  • 01-03-2024.

స్క్రీనింగ్ పరీక్ష తేదీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష):

  • 13-04-2024.

హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధికారిక వెబ్ సైట్:

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి