iDreamPost
android-app
ios-app

బొగ్గు గనుల్లో 1,425 ఉద్యోగాలు.. పరీక్ష లేదు.. ఈ అర్హతలుండాలి!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బొగ్గు గనుల్లో 1425 ఉద్యగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. పరీక్ష లేకుండానే ఈ ఉద్యోగాలకు ఎంపిక కావొచ్చు. అభ్యర్థులు ఈ అర్హతలు కలిగి ఉండాలి.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బొగ్గు గనుల్లో 1425 ఉద్యగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. పరీక్ష లేకుండానే ఈ ఉద్యోగాలకు ఎంపిక కావొచ్చు. అభ్యర్థులు ఈ అర్హతలు కలిగి ఉండాలి.

బొగ్గు గనుల్లో 1,425 ఉద్యోగాలు.. పరీక్ష లేదు.. ఈ అర్హతలుండాలి!

మీరు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను దక్కించుకునే అవకాశం వచ్చింది. బొగ్గు గనుల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పరీక్ష, ఇంటర్య్వూ లేకుండానే ఈ ఉద్యోగాలను పొందొచ్చు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్‌పూర్‌లోని సౌత్-ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(ఎస్‌ఈసీఎల్‌) గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్‌ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 1425 అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

పోస్టులను అనుసరించి డిగ్రీ/డిప్లొమా అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 27 వరకు దరఖాస్తుల చేసుకునేందుకు గడువు విధించారు. దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. వెంటనే అప్లై చేసుకోండి. దరఖాస్తు చేసుకోదలిచిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఎస్‌ఈసీఎల్‌ అధికారిక వెబ్ సైట్ ను https://www.secl-cil.in/పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

  • మొత్తం ఖాళీల సంఖ్య: 1,425.

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్:

  • 350 పోస్టులు

విభాగాలవారీగా ఖాళీలు:

  • మైనింగ్ ఇంజినీరింగ్‌: 200
  • ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌: 50
  • మెకానికల్ ఇంజినీరింగ్‌: 50
  • సివిల్ ఇంజినీరింగ్‌: 30
  • ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌: 20

అర్హత:

  • అభ్యర్థులు సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

స్టైపెండ్:

  • ఎంపికైన వారికి రూ.9000 అందిస్తారు.

టెక్నీషియన్‌ అప్రెంటిస్:

  • 1075 పోస్టులు

విభాగాలవారీగా ఖాళీలు:

  • మైనింగ్ ఇంజినీరింగ్/ మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్: 900
  • మెకానికల్ ఇంజినీరింగ్‌: 50
  • ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌: 75
  • సివిల్ ఇంజినీరింగ్‌: 50

అర్హత:

  • అభ్యర్థులు సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు 13.022024 నాటికి 18 సంవత్సరాలలోపు ఉండాలి.

స్టైపెండ్:

  • ఎంపికైన వారికి రూ.8000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌లైన్

ఎంపిక విధానం:

  • విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఉత్తీర్ణత సంవత్సరం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 13-02-2024.

దరఖాస్తుకు చివరితేది:

  • 27-02-2024.

ఎస్‌ఈసీఎల్‌ అధికారిక వెబ్ సైట్:

jojobet girişJojobet GirişCasibomivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetBetvolemarsbahis girişJojobet GirişJojobet Giriş