iDreamPost

మరోసారి మానవత్వం చాటుకున్న KTR! ఇది గొప్ప సాయం!

బీఆర్ఎస్ నేత కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం ఓ ఉప ఎన్నిక జరగనుండగా.. అక్కడ ప్రచారానికి వెళ్లాడు. మార్గమధ్యంలోనే ఓ వ్యక్తి పడిపోయి ఉండటాన్ని గమనించాడు.

బీఆర్ఎస్ నేత కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం ఓ ఉప ఎన్నిక జరగనుండగా.. అక్కడ ప్రచారానికి వెళ్లాడు. మార్గమధ్యంలోనే ఓ వ్యక్తి పడిపోయి ఉండటాన్ని గమనించాడు.

మరోసారి మానవత్వం చాటుకున్న KTR! ఇది గొప్ప  సాయం!

‘మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు.. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు’ అని ఓ సినీ కవి చెప్పినట్లుగా.. ఈ పలుకులు నేటి కాలంలో అక్షర సత్యాలు. ఆపదలో ఉన్న వ్యక్తిని పలకరిస్తే ఎక్కడ సాయం చేయాల్సి వస్తుందని ఆలోచిస్తున్నారు నేటి సమాజంలోని మానవులు. పక్కన మనిషి పడిపోయి విల విల ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే సెల్పీలు తీసి.. వీడియో పోస్టు చేసి సొసైటీకి ఏదో చేశామని అనుకుంటున్నారు తప్ప.. సకాలంలో స్పందించి.. ఆసుపత్రికి తీసుకెళ్లాలన్న చిన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఈ సాయం ఓ ప్రాణాన్ని కాపాడుతుందన్న ఆలోచన చేయడం లేదు. దారిపోయే వ్యవహారం మనకెందుకులే అని పట్టించుకోవట్లేదు. కానీ తెలంగాణ మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అలా అనుకులేదు.

మానవత్వాన్ని చాటి మరోసారి ప్రజల మనస్సును గెలుచుకున్నారు. ఇంతకు అసలు ఏమైందంటే..? వరంగల్ లేబర్ కాలనీ వద్ద అంజయ్య అనే 55 ఏళ్ల వ్యక్తి యాక్సిడెంట్‌కు జరిగి రోడ్డుపై పడిపోయాడు. చాలా మంది అతడ్ని చూసి పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. ఆ సమయంలో అటుగా వస్తున్న కేటీఆర్.. తన కాన్వాయ్ నిలిపి.. స్వయంగా అతడే కిందకు దిగి.. ప్రమాదానికి గురైన వ్యక్తిని తన ఎస్కార్ట్ కారులో ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు. అతడ్ని అత్యవసర చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. సకాలంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత స్పందించడంపై ప్రశంసిస్తున్నారు నెటిజన్లు.

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచార నిమిత్తం కేటీఆర్.. వరంగల్ పర్యటనలో ఉన్నారు. కాగా, ప్రమాదం జరిగిన ప్రాంతం వైపు నుండి వెళ్తున్న కేటీఆర్.. యాక్సిడెంట్ జరిగిందని తెలిసి.. తన కాన్వాయ్ నిలిపి.. బాధితుడ్ని చూశాడు. సకాలంలో స్పందించి.. తన కారులో ఆసుపత్రి తరలించి మానవత్వం చాటుకున్నారు. అందరిలా తనకు ఏం పట్టన్నట్లు వ్యవహరించకుండా.. తోటి మనిషిగా సాయపడ్డాడు నేత. పలకరించడమే పాపం అనుకుంటున్న రోజుల్లో.. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఓ యాక్సిడెంట్ బాధితుడి కోసం తన సమయాన్ని కేటాయించాడు కేటీఆర్.  అతడు చేసిన గొప్ప పనిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ విషయం తెలిసి నెట్టింట్లో ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘మాన్ విత్ గోల్డెన్ హార్ట్’, ‘గుడ్ జాబ్ అన్న’, మానవత్వం ఉన్న మనిషి కేటీఆర్ అంటూ నెట్టింట్లో కామెంట్స్ చేస్తుననారు సోషల్ సైనికులు, కేటీఆర్ ఫ్యాన్స్. ప్రస్తుతం బాధితుడు..వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి