iDreamPost

OTT News: సూపర్ కామెడీ మూవీ ఓం భీమ్ బుష్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Mar 22, 2024 | 12:56 PMUpdated Mar 22, 2024 | 12:56 PM

ఇప్పుడంతా ఓటీటీ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా రిలీజ్ అయిన "ఓం భీమ్ బుష్ " సినిమాకు సంబంధించిన ఓటీటీ విషయాలపై కూడా అందరికి ఇంట్రెస్ట్ పెరిగింది. మరి ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ ఎప్పుడో చూద్దాం.

ఇప్పుడంతా ఓటీటీ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా రిలీజ్ అయిన "ఓం భీమ్ బుష్ " సినిమాకు సంబంధించిన ఓటీటీ విషయాలపై కూడా అందరికి ఇంట్రెస్ట్ పెరిగింది. మరి ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ ఎప్పుడో చూద్దాం.

  • Published Mar 22, 2024 | 12:56 PMUpdated Mar 22, 2024 | 12:56 PM
OTT News: సూపర్ కామెడీ మూవీ ఓం భీమ్ బుష్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలకు వచ్చే రిజల్ట్ ఎలా ఉన్నా సరే.. ఓటీటీలో మాత్రం ఆయా సినిమాలకు క్రేజ్ బాగా పెరిగిపోతూ ఉంటుంది. ఇక ఈ క్రమంలో ఏదైనా సినిమా థియేటర్ లో రిలీజ్ అయిందంటే.. ముందుగా అందరూ తెలుసుకోవాలనుకునేది.. ఆయా సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ డీటెయిల్స్. ప్రముఖ ఓటీటీ సంస్థలు సైతం దాదాపు సినిమాలను థియేట్రికల్ రిలీజ్ కంటే ముందుగానే.. ఆయా సినిమాల డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంటుంది. దీనితో ప్రేక్షకులకు కూడా.. ఆయా సినిమాల ఓటీటీ డీటెయిల్స్ ను తెలుసుకోవాలనే ఆసక్తి బాగా పెరుగుతుంది. ఈ క్రమంలో.. తాజగా మార్చి 22న థియేటర్ లో రిలీజ్ అయినా కామెడీ చిత్రం “ఓం భీమ్ బుష్” సినిమా డిజిటల్ రైట్స్ భారీగా అమ్మడుపోయాయట. మరి, ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వబోతుందో చూద్దాం.

హీరో శ్రీ విష్ణు, కమెడియన్ అండ్ యాక్టర్ ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ. కలిసి నటించిన హర్రర్ అండ్ కామెడీ కాంబో.. “ఓం భీమ్ బుష్”. మార్చి 22న ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు డైరెక్టర్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా చాలా డిఫరెంట్ గా చేశారు. దీనితో సోషల్ మీడియాలో ఈ సినిమా ప్రమోషన్స్ బాగా ఫేమస్ అయ్యాయి. ఇక థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత కూడా .. ఈ సినిమాపై ఇప్పటివరకు అంతటా పాజిటివ్ టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాలో శ్రీ విష్ణు, ప్రియదర్శికి జోడీలుగా ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ హీరోయిన్లుగా నటించారు. వీరితో పాటు శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి ప్రధాన పాత్రలలో కనిపించారు. అయితే, “ఓం భీమ్ బుష్” సినిమా డిజిటల్ రైట్స్ మంచి ధరలకే అమ్ముడుపోయినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందట.

ఇక ఓటీటీ రూల్స్ ప్రకారం సినిమా థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకున్న నెల రోజుల తర్వాత.. ఓటీటీలో విడుదల చేస్తారన్న సంగతి తెలిసిందే. కాబట్టి సినిమా థియేటర్ రన్నింగ్ షోస్, కలెక్షన్స్ ను బట్టి.. ఓటీటీ ఎంట్రీ డేట్ ను ఫిక్స్ చేస్తారు మేకర్స్. సో ఏప్రిల్ చివరి వారంలో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమా అందరిని బాగానే మెప్పించింది. సినిమాలో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబో అదిరిపోయిందని, వారి కామెడీ టైమింగ్‌కు హిలేరియస్‌గా ఉందని రివ్యూలు వస్తున్నాయి. చూడబోతుంటే ఈ సినిమా వీకెండ్ లోపు మంచి కలెక్షన్స్ నే సంపాదించుకుంటుందనే టాక్ వినిపిస్తోంది. అయితే, హర్రర్ అండ్ కామెడీ టచ్ ను క్లియర్ గా ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం .. ఈ సినిమాను థియేటర్ లో చూడాల్సిందే.

ఇక ఓం భీమ్ బుష్ కథ విషయానికొస్తే.. ముగ్గురు స్నేహితుల మధ్య సాగే కథ ఇది. ముగ్గురు స్నేహితులు భైరవపురం గ్రామంలోకి వచ్చాక.. బ్యాంగ్ బ్రోస్ ఎ టు జెడ్ సొల్యూషన్స్‌ను ఎస్టాబ్లిష్ చేస్తారు. అలా ప్రతి సమస్యకు పరిష్కారంగా ట్యాబ్లెట్లతో పౌడర్ తయారు చేసి గ్రామస్తులకు అమ్ముతుంటారు. కొంతకాలానికి వారు వ్యాపారంలో బాగా రాణిస్తున్న క్రమంలో.. కొంతమంది అఘోరాలు ఆ గ్రామంలోకి ప్రవేశించి.. ఓ మహల్ లో ఉండే నిధిని కనుక్కోమని సవాల్ చేస్తారు. దీనితో ఆ ముగ్గురు స్నేహితులు ఆ వేటలో ఉంటారు. ఈ క్రమంలో వారు ఎటువంటి విచిత్ర సంఘటనలను ఎదుర్కొన్నారు! వారికి ఆ నిధి దొరికిందా లేదా! అసలు వారు ఆ ఛాలెంజ్ ను ఎందుకు తీసుకుంటారు! ఇవన్నీ చూడాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి, “ఓం భీమ్ బుష్” సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి