iDreamPost

Ola బంపరాఫర్.. S1 ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్‌పై రూ. 20 వేలు తగ్గింపు!

ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీ సంస్థ ఓలా కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ పై రూ. 20 వేల డిస్కౌంట్ ప్రకటించింది.

ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీ సంస్థ ఓలా కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ పై రూ. 20 వేల డిస్కౌంట్ ప్రకటించింది.

Ola బంపరాఫర్.. S1 ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్‌పై రూ. 20 వేలు తగ్గింపు!

ఇప్పుడంతా ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. పెరిగిన పెట్రోల్ ధరల కారణంగా పెట్రోల్ బైకులకంటే ఎలక్ట్రిక్ వెహికిల్స్ కొనేందుకే చాలా మంది మొగ్గుచూపుతున్నారు. పర్యావరణహితంగా ఉండడంతో ఎలక్ట్రిక్ బైకులు, కార్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలు కూడా కస్టమర్ల అభిరుచుల తగ్గట్లుగానే రకరకాల మోడళ్లను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే ఓలా, ఏథర్, బజాజ్, ఇంక కొన్ని ఇతర కంపెనీలు ఈవీ రంగంలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో ఓలా కంపెనీ కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. ఎస్1 స్కూటర్ల రేంజ్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది.

ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీ సంస్థ ఓలా స్కూటర్లకు కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభించింది. ఆధునిక ఫీచర్లు కలిగిన ఓలా స్కూటర్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. సేల్స్ లో ఓలా కంపెనీ టాప్ లో కొనసాగుతుంది. కాగా కంపెనీ పండగ వేల సేల్స్ ను మరింత పెంచుకునేందుకు ఆఫర్లను ప్రకటించింది. ఓలా ఫెస్టివల్ ప్రమోషన్లలో భాగంగా ఎలక్ట్రిక్ స్కూటర్లపై కొత్త ఆఫర్లను ప్రకటించింది. 2024 జనవరి 15 లోపు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఓలా ఎస్1 స్కూటర్ల రేంజ్ పై రూ. 20వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఆఫర్స్ లో భాగంగా ఓలా ఎస్1 ప్లస్ వేరియంట్ ను రూ. 89,999 కే దక్కించుకోవచ్చు.

20000 discount on ola s1 electric scooty

ఓలా డిస్కౌంట్లతో పాటు ఎస్ ప్రో, ఎస్1 ఎయిర్ మోడళ్లపై రూ.6,999 విలువైన కాంప్లిమెంటరీ ఎక్స్‌టెండెడ్‌ వారంటీని అందిస్తోంది. ఈ మోడళ్లను ఎంచుకునే కస్టమర్లు రూ.3,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ అందుకోవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ పోర్ట్ పోలియోలో మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. ఓలా ఎస్1ఎక్స్ దీని ధర రూ. 89,999 (ఎక్స్ షోరూమ్ ). ఓలా ఎస్1 ఎయిర్ దీని ధర రూ. 1లక్షా19వేల 828(ఎక్స్ షోరూమ్ ). ఓలా ఎస్1 ప్రో స్టాండర్డ్ – దీని ధర రూ. 1లక్షా 47వేల 499(ఎక్స్ షోరూమ్ ). మరి ఓలా ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి