iDreamPost
android-app
ios-app

డైరెక్ట్ గా OTTలోకి అదిరిపోయే సీక్వెల్.. ఫ్యామిలీ మ్యాన్ కి మించి..

  • Published Apr 03, 2024 | 4:28 PM Updated Updated Apr 03, 2024 | 4:28 PM

Manoj Bajpayee Movie Sequel On OTT: మనోజ్ బాజ్ పాయీ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ పాన్ ఇండియా లెవల్లో ఫ్యాన్స్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు అంతకు మించిన సినిమాకి సీక్వెల్ తో రాబోతున్నాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.

Manoj Bajpayee Movie Sequel On OTT: మనోజ్ బాజ్ పాయీ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ పాన్ ఇండియా లెవల్లో ఫ్యాన్స్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు అంతకు మించిన సినిమాకి సీక్వెల్ తో రాబోతున్నాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.

  • Published Apr 03, 2024 | 4:28 PMUpdated Apr 03, 2024 | 4:28 PM
డైరెక్ట్ గా OTTలోకి అదిరిపోయే సీక్వెల్.. ఫ్యామిలీ మ్యాన్ కి మించి..

ఓటీటీల హవా పెరిగిన తర్వాత సూపర్ హిట్ చిత్రాలు కూడా నేరుగా ఓటీటీలోకే వచ్చేస్తున్నాయి. స్వయంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా అదిరిపోయే సినిమాలను నిర్మిస్తున్నాయి. వాటిని నేరుగా ఓటీటీలోనే విడుదల చేస్తున్నాయి. మరికొన్నిసార్లు నిర్మాతలతో కలిసి నిర్మించిన చిత్రాలను నేరుగా ఓటీటీల్లోనే విడుదల చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఒక అదిరిపోయే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి సీక్వెల్ నేరుగా ఓటీటీలోకి విడుదల కాబోతోంది. అందులో హీరో మరెవరో కాదు మనోజ్ బాజ్ పాయీ. ఈయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. హ్యాపీ సినిమాలో ఐపీఎస్ గా చేసిన క్యారెక్టర్ ని ఆడియన్స్ ఇప్పటికీ మర్చిపోలేరు. ఆ తర్వాత కూడా తెలుగులో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశాడు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్తో పాన్ ఇండియా లెవల్లో ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు చెప్పుకునే చిత్రం అంతకు మించి ఉంటుంది అంటున్నారు.

మనోజ్ బాజ్ పాయీ కెరీర్లో తీసిన ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో ‘సైలెన్స్’ కూడా ఒకటి. ఈ చిత్రం 2021లో విడుదలై మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ రిలీజ్ కి రెడీ అయిపోయింది. అయితే ఆ సీక్వెల్ నేరుగా ఓటీటీలో విడుదల కానుండటం విశేషం. సైలెన్స్ 2 సినిమాకి సంబంధించి మేకర్స్ అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. అలాగే ఆ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు. అందులోనే అధికారిక విడుదల తేదీని ప్రేక్షకులకు తెలియజేశారు. ఈ సైలెన్స్ 2 చిత్రం ఏప్రిల్ 16 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ చిత్రాన్ని క్యాండిడ్ క్రియేషన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు.

ఈ సైలెన్స్ 2 సినిమా కథ విషయానికి వస్తే.. సిటీలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. ముగ్గురు అమ్మాయిలు దారుణంగా హత్యకు గురవుతారు. ఆ కేసు దర్యాప్తు బాధ్యత హీరో టీమ్ కు వస్తుంది. అసలు ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఆ వరుస హత్యల వెనుక ఎవరు ఉన్నారు? ఎలాంటి క్లూ ఉండదు. ఎలాంటి ఆధారాలు లేని ఒక కేసును మనోజ్ బాజ్ పాయీ టీమ్ దర్యాప్తు చేస్తుంటుంది. అయితే వారికి డెడ్ లైన్ కూడా ఉంటుంది. ఆ కేసును వాళ్లు ఛేదించలేకపోతే వేరే బృందానికి వెళ్లిపోతుందని చెప్తారు. ఒక డెడ్ లైన్ పెట్టుకుని హీరో టీమ్ పోరాడుతూ ఉంటుంది. ఒక నైట్ క్లబ్ లో జరిగిన హత్యల వెనుక ఎవరు ఉన్నారు? ఆ కేసును ఛేదించారా లేదా? అనేదే కథ. ఈ సినిమాలో ఫ్యామిలీ మ్యాన్ తరహాలోనే మనోజ్ బాజ్ పాయీ క్యారెక్టర్ ఉంటుంది. ఎంతో ఫిరోషియస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తూ ఉంటాడు. మరి.. డైరెక్ట్ గా ఓటీటీలోకి రాబోతున్న సైలెన్స్ 2 సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetMadridbetJojobetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet