iDreamPost

టీమిండియాను ఆపడం సాధ్యం కాదు.. ఆ జట్టే నా ఫేవరెట్: బ్రాడ్

  • Author singhj Published - 12:48 PM, Mon - 2 October 23
  • Author singhj Published - 12:48 PM, Mon - 2 October 23
టీమిండియాను ఆపడం సాధ్యం కాదు.. ఆ జట్టే నా ఫేవరెట్: బ్రాడ్

ప్రపంచ కప్​కు టైమ్ దగ్గర పడుతోంది. మరో మూడ్రోజుల్లో ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్​కు తెరలేవనుంది. దీంతో అన్ని టీమ్స్ ట్రోఫీ మీద కన్నేశాయి. ఈసారి మూడ్నాలుగు జట్లు ఫేవరెట్స్​గా కనిపిస్తున్నాయి. వాటిల్లో ఒకటి టీమిండియా. అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తున్న భారత్​కు కప్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. స్వదేశంలో టోర్నమెంట్ జరుగుతుండటం, ఆటగాళ్లు అందరూ ఫుల్ ఫామ్​లో ఉండటం భారత్​కు కలిసొచ్చే అంశమని చెప్పొచ్చు. ఇంగ్లండ్ లెజెండ్ స్టువర్ట్ బ్రాడ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ఈసారి వరల్డ్ కప్​లో తన ఫేవరెట్ కూడా భారత జట్టేనని బ్రాడ్ అన్నాడు. జోస్ బట్లర్ కెప్టెన్సీలోని ఇంగ్లండ్ జట్టు ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ప్రపంచ కప్​లో అడుగు పెడుతోందన్నాడు బ్రాడ్. అయితే టైటిల్​ను నిలబెట్టుకోవాలంటే మాత్రం ఇంగ్లండ్ రక్తం చిందించాల్సి వస్తుందన్నాడు. అదే టైమ్​లో టీమిండియా గనుక తమ స్థాయికి తగ్గట్లు ఆడితే.. ఆ జట్టును అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదని తేల్చిచెప్పాడు. ఒకవేళ ఇంగ్లండ్ గనుక మళ్లీ కప్​ గెలిస్తే అది చాలా గొప్ప విషయమన్నాడు. అదే టైమ్​లో భారత్​ను అస్సలు తక్కువ అంచనా వేయకూడదని బ్రాడ్ పేర్కొన్నాడు.

టీమిండియా గనుక తమ పర్​ఫెక్ట్ టోర్నమెంట్ ఆడితే ఆ జట్టును ఆపడం ఎవరికీ సాధ్యం కాదని నా గట్టి నమ్మకం. ఈ టోర్నమెంట్ బరిలో దిగుతున్న జాస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ టీమ్​ చాలా బాగుంది. భారీ టార్గెట్లను నిర్దేశించే సత్తా ఆ జట్టుకు ఉంది. కానీ ప్రపంచ కప్​కు ఆతిథ్యం ఇస్తున్న భారత జట్టును ఎదుర్కోవడం ఇంగ్లండ్​కు కష్టమనిపిస్తోంది. ప్రస్తుతం ఆ టీమ్​ వన్డేల్లో నంబర్ వన్ పొజిషన్​లో ఉంది’ అని బ్రాడ్ చెప్పుకొచ్చాడు. మరి.. భారత్​ను ఆపడం ఇంగ్లండ్​కు కూడా కష్టమేనంటూ బ్రాడ్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వరల్డ్ కప్​లో ఆస్ట్రేలియా బలాలు, బలహీనతలు.. ఆరో కప్ గెలిచే ఛాన్స్?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి