iDreamPost

పండగపూట షాకిచ్చిన బంగారం.. భారీగా పెరిగిన ధర

  • Published Aug 31, 2023 | 8:22 AMUpdated Aug 31, 2023 | 8:22 AM
  • Published Aug 31, 2023 | 8:22 AMUpdated Aug 31, 2023 | 8:22 AM
పండగపూట షాకిచ్చిన బంగారం.. భారీగా పెరిగిన ధర

రాఖీ పండుగ.. ఇంటికి వచ్చి.. రాఖీ కట్టిన సోదరికి బహుమతిగా బంగారం కొనాలని భావించేవారికి.. పండుగ కదా.. పసిడి కొంటే కలిసి వస్తుందని నమ్మి.. గోల్డ్‌ కొందాము అనుకునేవారికి.. భారీ షాకింగ్‌ న్యూస్‌. ఎందుకంటే.. పండగ పూట బంగారం ధర భారీగా పెరిగి.. పసిడి ప్రియులకు షాక్‌ ఇచ్చింది. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధర పెరిగింది. పెరిగిన ధర చూసి.. గోల్డ్‌ కొనాలనుకునేవారు.. భయపడుతున్నారు. దేశీయంగానే కాక అంతర్జాతీయ మార్కెట్‌లో సైతం బంగారం ధర భారీగానే పెరిగింది. నేడు మన దగ్గర గోల్డ్‌ రేటు ఎంత పెరిగింది అంటే..

హైదరాబాద్ మార్కెట్లో వరుసగా రెండో రోజు కూడా బంగారం ధర పెరిగింది. నేడు భాగ్యనగరంలో.. ఆభరణాల తయారీకి వినియోగించే.. 22 క్యారెట్‌ బంగారం ధర 10 గ్రాముల మీద రూ. 300 పెరిగి రూ. 55 వేల మార్కుకు చేరింది. ఇక 24 క్యారెట్‌ స్వచ్ఛమైన 10 గ్రాముల ధర 60 వేల మార్కుకు చేరింది. ఇక ఢిల్లీ బులియన్ మార్కెట్లో కూడా నేడు బంగారం ధర పెరిగింది. ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాముల మీద రూ. 300 పెరిగి రూ. 55,150 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేటు కూడా రూ. 330 పెరిగి ప్రస్తుతం రూ. 60, 150 వద్ద అమ్ముడవుతోంది. గత రెండు రోజుల్లో చూసుకుంటే బంగారం ధర 10 గ్రాముల మీద రూ.600 మేర పెరిగింది.

ఒక్కరోజే రూ.700 పెరిగిన వెండి..

వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తూ.. భారీగా పెరిగింది. గత మూడు రోజులుగా స్థిరంగా కొనసాగిన వెండి రేటు ఇవాళ ఒక్క రోజే కిలో మీద ఏకంగా రూ. 700 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రేటు హైదరాబాద్‌లో రూ. 80,700 పలుకుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే నేడు కిలో వెండి ధర రూ. 500 పెరిగి ప్రస్తుతం రూ. 77,600 పలుకుతోంది. ఢిల్లీతో పోల్చితే.. భాగ్యనగరంలో.. బంగారం రేటు తక్కువగా ఉండగా.. వెండి రేటు మాత్రం ఎక్కువగా ఉంటుంది. స్థానికంగా ఉండే పన్నులే ఇందుకు కారణం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి