iDreamPost

ఇంటర్‌లో చేరాలా ? ఇక్కడ ఫ్రీగా కార్పొరేట్ ఎడ్యుకేషన్! అప్లై చేసుకోండి!

విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించిన తెలంగాణ ప్రభుత్వం. ఫీజు చెల్లించకుండా ఆంగ్ల మాధ్యమంలో ఇంటర్ విద్యను పూర్తి చేయాలనుకునే విద్యార్థులు అడ్మిషన్ల కోసం వెంటనే అప్లై చేసుకోండి.

విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించిన తెలంగాణ ప్రభుత్వం. ఫీజు చెల్లించకుండా ఆంగ్ల మాధ్యమంలో ఇంటర్ విద్యను పూర్తి చేయాలనుకునే విద్యార్థులు అడ్మిషన్ల కోసం వెంటనే అప్లై చేసుకోండి.

ఇంటర్‌లో చేరాలా ? ఇక్కడ ఫ్రీగా కార్పొరేట్ ఎడ్యుకేషన్! అప్లై చేసుకోండి!

తెలంగాణలో పదో తరగతి ఫలితాలు గత నెల 30న విడుదలైన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థుల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇక ఇప్పుడు విద్యార్థుల దృష్టంతా పై చదువులపైనే ఉంది. ఏ కోర్సులో చేరాలి? ఏయే కోర్సులు చదివితే ఫ్యూచర్ బాగుంటుంది? ఉపాధి అవకాశాలు త్వరగా పొందాలంటే అందుబాటులో ఉన్న కోర్సులు ఏంటని ఆరా తీస్తున్నారు. ఇంటర్మీడియట్ లో చేరాలా? లేక పాలిటెక్నిక్, ఒకేషనల్, ఐఐఐటీ వంటి కోర్సులు ఎంచుకోవాలా అనే సందిగ్థంలో ఉన్నారు. మరి మీరు ఒక వేళ ఇంటర్ లో చేరాలని భావిస్తే ఇదే మంచి అవకాశం. రూపాయి ఫీజు లేకుండా.. ఇంగ్లీష్ మీడియంలో బోధన అందించే మోడల్ స్కూళ్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.

ఇంటర్ విద్యను అందించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీల్లో వేలు, లక్షల్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదే ప్రభుత్వ కాలేజీల్లో అయితే పైసా ఖర్చు లేకుండానే ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేయొచ్చు. ఈక్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 194 మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం డిపార్ట్ మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఫస్ట్ ఇయర్ లో ప్రవేశాల కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

టెన్త్ క్లాస్ పాసైన విద్యార్థులు ఇంటర్మీడియట్ లో చేరాలని భావిస్తే మోడల్ స్కూళ్లో అడ్మిషన్ కోసం వెంటనే అప్లై చేసుకోండి. మే 10 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. టెన్త్ క్లాస్‌లో వ‌చ్చిన జీపీఏ ఆధారంగా ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్‌లో ప్ర‌వేశాలు క‌ల్పించ‌నున్నారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సుల్లో 40 సీట్ల చొప్పున సీట్ల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ నాలుగు కోర్సులకు ఇంగ్లీష్ మీడియంలోనే బోధన అందించనున్నారు. ద‌ర‌ఖాస్తు చేసుకోదలిచిన విద్యార్థులు పూర్తి సమాచారం కోసం www.tsmodelschools.com వెబ్‌సైట్‌ను పరశీలించండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి