iDreamPost
android-app
ios-app

నెల కూడా కాలేదు రిలీజై.. OTTలోకి వచ్చేస్తున్న నయన్ కాంట్రవర్సీ మూవీ

సినిమా హద్దులు దాటేసింది. మూవీ లవర్స్ కూడా అన్ని భాషల్లోని సినిమాలు చూస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీల్లో ఈ మూవీలకు మంచి ఆదరణ లభిస్తుంది. డబ్బింగ్ వర్షన్లతో పలు మూవీలు వచ్చి.. ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి.

సినిమా హద్దులు దాటేసింది. మూవీ లవర్స్ కూడా అన్ని భాషల్లోని సినిమాలు చూస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీల్లో ఈ మూవీలకు మంచి ఆదరణ లభిస్తుంది. డబ్బింగ్ వర్షన్లతో పలు మూవీలు వచ్చి.. ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి.

నెల కూడా కాలేదు రిలీజై.. OTTలోకి వచ్చేస్తున్న నయన్ కాంట్రవర్సీ మూవీ

ప్రతి శుక్రవారం థియేటర్లలో ఏ మూవీ వస్తుందా అని ఎదురు చూసే మూవీ లవర్స్.. ఇప్పుడు ఓటీటీలో వచ్చే చిత్రాల కోసం ఎదురు చూస్తున్నారు. థియేటర్లకు పరుగులు పెట్టలేని మహిళలు సైతం ఓటీటీ సినిమాల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇతర భాషల్లో హిట్ టాక్ తెచ్చుకున్న మూవీస్ డబ్బింగ్ వర్షన్ కూడా అందుబాటులోకి రావడంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. షరా మామూలుగా ఈ వారం కూడా కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు పలు ఓటీటీ ఛానల్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడో కాంట్రవర్సీ మూవీ కూడా ఓటీటీకి వచ్చేస్తుంది. అదే అన్నపూరణి. ది గాడెస్ ఆఫ్ ఫుడ్ ఉప శీర్షిక. నయనతార ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీపై హిందూ సంఘాలు మండిపడ్డాయి.

లేడీ సూపర్ స్టార్‌గా పేరు పొందిన నయన తార.. ఈ ఏడాది జవాన్ మూవీతో మంచి హిట్ అందుకుంది. ఇదే మూవీతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. తాజాగా ఫ్యామిలీ సెంటిమెంట్‌తో వచ్చిన అన్నపూరణి అనే మూవీలో నటించింది. ఇది ఆమెకు 75వ సినిమా. రాజా-రాణిలో నటించిన జై-నయనతార జోడీ.. మళ్లీ ఈ మూవీలో కనిపించింది. డిసెంబర్ 1న థియేటర్లలో విడుదల కాగా.. అక్కడ వర్షాల ప్రభావం ఈ మూవీపై పడింది. వర్షాలు, వరదలు రావడంతో థియేటర్లలో ఈ మూవీని చూసేందుకు ఆసక్తి కనబర్చలేకపోయారు ప్రజలు. మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీలోని కొన్ని సీన్లపై హిందూ సంఘాలు, ముఖ్యంగా బ్రాహ్మణ వర్గానికి చెందిన కొంత మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మూవీని నిషేధించాలంటూ నిరసనలు కూడా చేపట్టారు.

nayantara movie in ott

ఈ మూవీని జీ స్టూడియోస్, నాట్ స్టూడియోస్, ట్రెడెంట్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించగా.. నీలేష్ కృష్ణ తెరకెక్కించాడు.  థమన్ మ్యూజిక్ అందించారు. ఇప్పుడు ఈ మూవీ రిలీజై నెల తిరగ కుండానే ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ మూవీని కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 29 అర్థరాత్రి నుండే ఈ మూవీ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అంటే ఈ రోజు అర్థరాత్రి నుండే ఈ మూవీని నయన్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ వీక్షించవచ్చు. అయితే ఈ మూవీ తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. మరీ ఈ మూవీ చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetmeritbetcasibom girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetcasibom girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet giriş