iDreamPost

Team India: టీమిండియా ప్లేయర్లకు ఘోర అవమానం.. ఇంతకంటే మరోటి ఉండదేమో?

టీమిండియా ప్లేయర్లకు ఘోర అవమానం జరిగిందని భారత ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఐసీసీపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరి దానికి కారణం ఏంటి? ఆ వివరాలు..

టీమిండియా ప్లేయర్లకు ఘోర అవమానం జరిగిందని భారత ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఐసీసీపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరి దానికి కారణం ఏంటి? ఆ వివరాలు..

Team India: టీమిండియా ప్లేయర్లకు ఘోర అవమానం.. ఇంతకంటే మరోటి ఉండదేమో?

సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ ను డ్రా చేసుకుని చరిత్ర సృష్టించింది టీమిండియా. ఇక ఇదే జోష్ ను ఆఫ్గానిస్తాన్ తో జనవరి 11 నుంచి జరగబోయే మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లోనూ చూపించాలనుకుంటోంది. ఈ క్రమంలోనే టీమిండియా ప్లేయర్లకు భారీ షాక్ ఇచ్చింది ఐసీసీ. ప్రతిష్టాత్మకమైన అవార్డుల రేసులో ఒక్క టీమిండియా ప్లేయర్ ను కూడా నామినేట్ చేయలేదు. ఇక ఈ విషయం తెలిసిన టీమిండియా ఫ్యాన్స్ ఇది భారత ఆటగాళ్లకు జరిగిన ఘోర అవమానం అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంతకీ ఆ అవార్డ్ ఏంటి? వాటికి నామినేట్ అయిన ప్లేయర్లు ఎవరు? ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రతీ నెల అద్భుతమైన ఆటతీరు కనబర్చిన ప్లేయర్లకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అనే అవార్డు ను ప్రకటిస్తుంది. అందులో భాగంగా 2023 డిసెంబర్ నెలకు సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్ట్ లో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, బంగ్లాదేశ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్, న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ నామినేట్ అయ్యారు. ఈ జాబితాలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఇండియన్ ప్లేయర్ లేకపోవడం బాధాకరం. ఇది భారత ఆటగాళ్లకు జరిగిన ఘోర అవమానం కిందే లెక్క అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

కాగా.. ఐసీసీ టీమ్స్ లో చోటు దక్కించుకున్న టీమిండియా ప్లేయర్లు డిసెంబర్ మంత్ కు నామినేట్ అవ్వకపోవడం ఆశ్చర్యం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహ్మద్ సిరాజ్, బుమ్రా లాంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ వారిలో ఒక్కరిని కూడా నామినేట్ చేయలేదు. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ తో జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడంలో కమ్మిన్స్ కీలక పాత్ర పోషించాడు. అద్బుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు కమ్మిన్స్. ఈ క్రమంలోనే టెస్ట్ ల్లో 250 వికెట్ల క్లబ్ లో చేరాడు. ఇక న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో 15 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు తైజుల్ ఇస్లామ్. బంగ్లాదేశ్ తో జరిగిన సిరీస్ లో కివీస్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. దీంతో వీరిని ఐసీసీ డిసెంబర్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ చేసింది. మరి ఈ అవార్డుకు టీమిండియా ఆటగాళ్లను నామినేట్ చేయకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి