iDreamPost

కిమ్ ఆరోగ్యంగానే ఉన్నాడంట …

కిమ్ ఆరోగ్యంగానే ఉన్నాడంట …

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ జోన్ ఉన్ ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్లు అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తలను దక్షిణ కొరియా ప్రభుత్వ వర్గాలు ఖండించాయి.కిమ్‌ జోంగ్‌ ఆరోగ్యం విషమంగా ఉందనే వార్త నిజం కాదని కొట్టిపడేశాయి.తాజాగా దక్షణ కొరియా రాజధాని సియోల్‌ కేంద్రంగా పనిచేసే ఒక మీడియా సంస్థ ఏప్రిల్‌ 12న గుండెకు శస్త్ర చికిత్స జరిగిందని కిమ్‌ ప్రస్తుతం హ్యాంగ్‌సాన్‌లోని మౌంట్‌ కుమ్‌గాంగ్‌ రిసార్టులో ఐసోలేషన్‌లో ఉన్నారని పేర్కొంది.ఇంకా ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు కూడా వెల్లడించింది.

ఏప్రిల్‌ 15న ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు, తన తాత కిమ్‌ II సంగ్‌ జయంతి వేడుకలకు కిమ్‌ గైర్హాజరయ్యారు.దేశంలోనే అతిపెద్ద వేడుకగా జరిగే తన తాత జయంతి ఉత్సవాలలో గత సాంప్రదాయానికి భిన్నంగా దేశాధినేత పాల్గొనలేదు.

ఈ నేపథ్యంలో బాహ్య ప్రపంచానికి కిమ్‌ దూరంగా ఉండడానికి శస్త్ర చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని అమెరికాకు చెందిన CNN మీడియా సంస్థ ఒక కథనాన్ని వెలువరించింది. ఇందులో ఆయనకు బ్రెయిన్‌ డెడ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఉత్తర కొరియా వ్యవహారాలను చూసే అమెరికా ఉన్నతాధికారి చెప్పారని సీఎన్‌ఎన్‌ పేర్కొంది.

అయితే సీఎన్‌ఎన్‌‌ కథనాన్ని ధ్రువీకరించలేమని ఉత్తర కొరియా నుంచి ఎటువంటి అసాధారణ సంకేతాలు వెలువడటం లేదని ది ప్రెసిడెన్షియల్‌ బ్లూ హౌజ్‌ ప్రకటించింది.అధ్యక్షుడు కిమ్ జోంగ్‌ ఆరోగ్యంపై మీడియాలో వెలువడుతున్న వార్తలను ఉత్తరకొరియా తోసిపుచ్చింది.కిమ్‌ వేడుకలకు గైర్హాజరుపై స్పందించిన ఉత్తర కొరియా ఇప్పటి వరకు ఈ సంవత్సరం సగటున వారానికి ఒకటి చొప్పున 17 అధికారిక కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారని స్పష్టం చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి