iDreamPost

కిమ్ బతికే ఉన్నారు

కిమ్ బతికే ఉన్నారు

తన ఉనికి పై వెలువడిన ఊహాగానాలకు తెరదించుతూ ఉత్తరకొరియా అధినేత ప్రజల ముందుకు వచ్చారు. కిమ్ జోన్ ఉన్ అనారోగ్య కారణాలతో చికిత్స తీసుకుంటున్నారని, గుండెపోటుతో మరణించారని, బ్రెయిన్డెడ్ తో చనిపోయారంటూ పలు కథనాలు ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. వీటన్నిటిని పటాపంచలు చేస్తూ కిమ్ ఓ ఎరువుల కంపెనీ నిర్మాణం పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమానికి హాజరైనట్లు ఆ దేశ అధికారిక మీడియా మీడియా తెలిపింది. ఆ కార్యక్రమానికి కిమ్ సోదరి.. జోన్ కూడా హాజరైనట్లు అధికారిక మీడియా కేసీఎమ్ఏ తెలిపింది.

కిమ్ ఏప్రిల్ 11వ తేదీ నుంచి బహిరంగంగా కనిపించలేదు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం పై రకరకాల అనుమానాలు రేకెత్తాయి. ఏప్రిల్ 15 ఆయన తాత 108వ జయంతి కార్యక్రమానికి హాజరు కాలేక పోయారు. అప్పటి నుంచి కిమ్ ఉనికిపై అనేక వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ అపోహలను తొలగించేలా కిమ్ ప్రజల ముందుకు వచ్చినట్లు కేసీఎంఏ పేర్కొంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి