iDreamPost
android-app
ios-app

తెలంగాణ అమరవీరులపై పాట పాడిన నూకరాజు.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో!

Sridevi Drama Company: జబర్ధస్త్ షో ద్వారా ఫేమస్ అయిన వారిలో నూకరాజు ఒకరు. తనదైన కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తుంటాడు. తాజాగా అమరవీరులపై నూకరాజు పాడిన సాంగ్ అందరిని కన్నీరు పెట్టించింది.

Sridevi Drama Company: జబర్ధస్త్ షో ద్వారా ఫేమస్ అయిన వారిలో నూకరాజు ఒకరు. తనదైన కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తుంటాడు. తాజాగా అమరవీరులపై నూకరాజు పాడిన సాంగ్ అందరిని కన్నీరు పెట్టించింది.

తెలంగాణ అమరవీరులపై పాట పాడిన నూకరాజు.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో!

తెలుగు బుల్లితెరపై ఎంటర్ టైన్ షోలకి కొదవే లేదు. అయితే కొన్ని షోలను మాత్రం ఆడియన్స్ అసలు మిస్ కారు. కారణంగా.. ఆ కార్యక్రమాలు ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటాయి. ఇంకా చెప్పాలంటే ఆ షోల కోసం ఆడియన్స్ ఎంతగానే ఎదురు చూస్తుంటారు. అలాంటి షోల్లో శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు వచ్చే ఈ షో కోసం చాలా మంది ప్రేక్షకులు ఎందురు చూస్తుంటారు. అలానే ప్రతి వారం కొత్తగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది శ్రీదేవి డ్రామా కంపెని. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో జబర్దస్ కమెడియన్ నూకరాజు అమరవీరులపై పాడిన పాటకు అందరూ కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జబర్దస్త్ షో గురించి  తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ షో ద్వారా ఎంతో మంది  మంచి గుర్తింపు పొందారు. గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ వంటి వాళ్లు మంచి క్రేజ్ సంపాదించారు. బుల్లితెర నుంచి వెండితెరపై కూడా చాలా మంది  జబర్దస్త్ నటులు మెరిసారు. ఇలా జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించిన వారిలో నూక రాజు ఒకరు. అతను తనదైన పంచ్ లతో నవ్వుల పువ్వులు పూయిస్తాడు. అంతేకాక తోటి నటుల మాటలతు తనదైన స్టైల్లో పంచ్ లు వేస్తుంటాడు. ఇలా కేవలం కామెడీ డైలాగ్సే కాకుండా..నూక రాజుల్లో మంచి డ్యాన్స్ కూడా ఉన్నాడు. గతంలో ‘కాంతారా’ సినిమాలోని సాంగ్ కి అద్భుతంగా ప్రదర్శన చేశారు.

తాజాగా నూకరాజులోని సింగర్ కూడా వెలుగులోకి వచ్చాడు. శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించి ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో ఆద్యంతం ఎంతో  ఎంటర్ టైన్ గా సాగింది. అలానే నూకరాజు ఫైమాపై పేరడి పాట పాడి రచ్చ చేశాడు. ఇక ఈ షోకు హీరో సుధీర్ బాబు గెస్ట్ గా వచ్చారు. ఈ క్రమంలోనే యాంకర్ రష్మీపై సుధీర్ బాబు పంచ్ వేశారు. ఇది ఇలా ఉంటే.. చివర్లో నూకరాజు..తెలంగాణ కోసం పోరాడి..అమరులైన వారిపై ఓ సాంగ్ పాడాడు. తెలంగాణ కోసం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంత్ చారిపై నూకరాజు పాడిన పాటకు అందరు కన్నీరు పెట్టుకున్నారు. దీంతో కొన్ని క్షణాల పాటు అందరిని నూక రాజు ఏడిపించాడని, అద్భుతంగా సాంగ్ పాడడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ప్రోమో చివర్లో నూకరాజు పాడిన సాంగ్ కి అందరూ ఎమోషనలయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు వీక్షించి..మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbet