iDreamPost

Nobel Prize: నోబెల్‌ గ్రహీతకు జైలు శిక్ష.. కారణం ఏంటంటే?

ప్రపంచంలో నోబెల్ బహుబతి ఎంతో ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తుంటారు. ప్రముఖ స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరిట ఈ బహుబతి ప్రధానం చేస్తుంటారు.

ప్రపంచంలో నోబెల్ బహుబతి ఎంతో ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తుంటారు. ప్రముఖ స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరిట ఈ బహుబతి ప్రధానం చేస్తుంటారు.

Nobel Prize: నోబెల్‌ గ్రహీతకు జైలు శిక్ష.. కారణం ఏంటంటే?

నోబెల్ బహుబతి ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ప్రపంచ శాంతి, వైద్య, రసాయన, భౌతిక, సాహిత్య రంగాల్లో ఎనలేని కృషి చేసిన వారికి నోబెల్ బహుమతి బహుకరిస్తుంటారు. ఈ ఐదు బహుమతులు ప్రముఖ స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ ఇస్తున్నారు. ఆయన గౌరవార్థం ఆర్ధిక శాస్త్ర బహుమతి మటుకు 1969 నుంచి బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ద్వారా ఇస్తున్నారు. ఈ ఆరు బహుమతుల్లో శాంతి బహుమతి తప్ప మిగతా ఐదు బహుమతులు ప్రతి సంవత్సరం డిసెంబర్ 10నాడు స్టాక్ హూమ్ లో నోబెల్ వర్ధంతి పురస్కరించుకొని ఇస్తుంటారు. తాజాగా ప్రముఖ ఆర్ధిక వేత్త, నోబెల్ బహుమతి గ్రహీతకు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.. ఆయన ఎవరు.. ? ఏ దేశం ఆ శిక్ష విధించింది? అన్న విషయం గురించి తెలుసుకుందాం.

నోబెల్ బహుమత్రి గ్రహీత, బంగ్లాదేశ్ ఆర్దిక వేత్త అయిన డాక్టర్ మహ్మద్ యూనస్ (83) కు కోర్టు సోమవారం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఎన్నికల ముందు ఆయన అరెస్టు పై రాజకీయంగా చర్చలకు దారి తీస్తుంది. కార్మిక చట్టాలను ఉల్లంఘించిన కారణంగా ఆయనకు కోర్టు జైలు శిక్ష విధించింది. మహమ్మద్ యూనస్‌ పేదరిక వ్యతిరేక ప్రచారం, ఇతర కార్యక్రమాలకు 2006 లో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి గెల్చుకున్నారు. 1983 ఆయన స్థాపించిన గ్రామీణ్ బ్యాంక్ ప్రపంచంలో హుమ్ ఆఫ్ మైక్రో క్రెడిట్ గా ప్రసిద్ది పొందింది. ఈ క్రమంలోనే ఆయన స్థాపించిన బ్యాంక్ లో కార్మిక సంక్షేమ నిధి సమకూర్చలేదని ఆయనతో పాటు మరో ముగ్గురు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించారని కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో మహ్మద్ యూనస్ తో పాటు ముగ్గురు సహచరులకు కోర్టు జైలు శిక్ష విధించింది.

Jail sentence for Nobel laureate!

జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి 25 వేల బంగ్లా టాకాల చోప్పున జరిమాన విధించింది కోర్టు. ఒకవేళ జరిమానా కట్టడం విఫలమైతే మరో పది రోజులు అదనంగా జైలులో శిక్ష అనుభవించాలని ఆదేశించింది. తీర్పు అనంతరం యూనస్ తో పాటు మిగతా ముగ్గురు బెయిల్ కోసం అప్లై చేశారు. ఐదు వేల విలువైన టాకా బాండ్ సమర్పించగా.. జడ్జీ వారికి నెల రోజులపాటు బెయిల్ మంజూరు చేశారు. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ లో జనవరి 7న సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి.. ఇదే సమయంలో ఎన్నికల ముందు ఇలాంటి పరిణామం జరగడంపై సర్వత్రా చర్చలు కొనసాగుతున్నాయి. 2008 లో షేర్ హసినా అధికారంలోకి వచ్చారు. ఈ క్రమంలోనే యూనస్ పై సంచల ఆరోపణలు చేశారు. బ్యాంక్ లో పేదల రక్తాన్ని వడ్డీ రూపంలో వసూళ్లు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. యూనస్ కార్మిక చట్టం, నిధులు దుర్వినియోగం చేస్తున్నారని కేసుల నమోదు చేసి దర్యాప్తే ప్రారంభించింది. 2011 లో గ్రామీణ్ బ్యాంక్ కార్యాకలాపాలపై సమీక్ష నిర్వహించి ఆయనను మేనేజింగ్ డైరెక్టర్ గా తొలగించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి