iDreamPost

ఆ టీడీపీ నేతకు భారీ షాక్.. ఈ సారి టికెట్ లేదని చెప్పేసిన లోకేశ్!

Nara Lokesh: ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ నేతల పరిస్థితి దారుణంగా తయారైంది. టీడీపీ అధిష్టానం ఒక్కొక్కరిగా పరోక్షంగా షాకులు ఇస్తుంది. తాజాగా టీడీపీ చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఒకరి టికెట్ ఇచ్చేదిలేదని చెప్పేసినట్లు సమాచారం.

Nara Lokesh: ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ నేతల పరిస్థితి దారుణంగా తయారైంది. టీడీపీ అధిష్టానం ఒక్కొక్కరిగా పరోక్షంగా షాకులు ఇస్తుంది. తాజాగా టీడీపీ చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఒకరి టికెట్ ఇచ్చేదిలేదని చెప్పేసినట్లు సమాచారం.

ఆ టీడీపీ నేతకు భారీ షాక్.. ఈ సారి టికెట్ లేదని చెప్పేసిన లోకేశ్!

దేశ రాజకీయాల్లో ఏపీకి ప్రత్యేక స్థానం ఉంది. ఎక్కడ లేని విధంగా ఇక్కడి పాలిటిక్స్ చాలా చిత్రవిచిత్రంగా, ఆసక్తికరంగా ఉంటాయి. అలానే మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా ఉన్నాయి. అధికార వైఎస్సార్ సీపీ 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ప్రకటించి.. దూసుకెళ్తోంది. మరోవైపు టీడీపీ, జనసేనాలు తమ అభ్యర్థుల విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. ఇదే సమయంలో పొత్తుల్లో భాగంగా, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని చేర్చుకుని టీడీపీ.. ఆ పార్టీ నేతలకు షాకు ఇస్తుంది.  తాజాగా టీడీపీకి చెందిన కీలక నేత, మాజీ మంత్రి ఒకరి లోకేశ్ షాక్ ఇచ్చారు.

ప్రస్తుతం టీడీపీ నేతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కష్టకాలంలో పార్టీని నమ్ముకుని ఉన్నవారికి  సైతం అధిష్టానం షాకిస్తుంది. పక్కపార్టీ నుంచి వచ్చిన వారికి పెద్ద పీట వేస్తూ పార్టీని నమ్ముకున్న వారిని నట్టేముంచేస్తుందనే టాక్ వినిపిస్తోంది. నూజీవీడు విషయంలో అదే జరిగింది. అక్కడ టీడీపీ ఇన్ ఛార్జీగా ఉన్న ముదరబోయిన వెంకటేశ్వరావును పక్కన పెట్టి.. వైసీపీ నుంచి వచ్చిన పార్థసారథికి ఆ బాధ్యతలను అప్పగించారు. దీంతో ఆయన తీవ్రవేదనకు గురయ్యారు. తాను పార్టీని నమ్ముకుని ఉంటే.. ఇంతలా మోసం చేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

తాజాగా టీడీపీలో కీలక నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ కార్యదర్శి నారా లోకేశ్ ఆలపాటికి షాక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తెనాలి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీకి ప్రయత్నాలు చేస్తున్న ఆలపాటి ఆశల అడియాసలయ్యాయి. ఆయనకు పార్టీ టికెట్‌ లేదని సాక్షాత్తూ నారా లోకేశ్‌ మంగళ వారం తేల్చి చెప్పేశారని సమాచారం. 2024 ఎన్నికలకు జనసేన, టీడీపీ పొత్తుల భాగంగా తెనాలి నుంచి పోటీ చేసేందుకు జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ రంగం సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే. రెండు నెలల క్రితమే మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీస్ లో పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.  అయినప్పటికీ తానూ పోటీలో ఉన్నట్టుగా రాజా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. అంతేకాక ఒక అడుగు ముందుకేసి ప్రజా చైతన్యయాత్ర పేరుతో తెనాలి నియోజకవర్గంలో పాదయాత్ర కూడా చేపట్టారు.

ఈ నేపథ్యంలో నారా లోకేశ్‌ మంగళవారం దీనిపై స్పష్టత ఇచ్చినట్టు తెలిసింది. గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తే చెయ్‌… లేదంటే నీదారి నువ్వు చూసుకొమ్మని లోకేశ్‌ చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే గుంటూరు స్థానం నుంచి  ఇప్పటికే ఎన్నారై  పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేసేందుకు సన్నాహాల్లో ఉన్నారు. దీంతో అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ లో తనకు చుక్కెదు కావడంతో  ఆలపాటికి ఏం చేయాలో పాలుపోవటం లేదని స్థానిక నేతలు చెబుతున్నారు. మొత్తంగా నమ్మిన వారికి షాకిచ్చే టీడీపీ, మరో కీలక నేతను కూడా మోసం చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి