iDreamPost

Raghu Rama Raju: టికెట్ దక్కని రఘురామరాజు.. గుడ్డిగా బాబుని నమ్మితే నిలువునా ముంచేశాడు!

వైఎస్సార్ సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజుకు గట్టి షాక్ తగిలింది. ఆయన ఎంతో కాలంగా ఆశపెట్టుకున్న నరసాపురం ఎంపి టికెట్ దక్కలేదు. అయితే ఆయన నోటి దురుసు కారణంగానే ఆయనకు టికెట్ దక్కలేదని టాక్ వినిపిస్తోంది.

వైఎస్సార్ సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజుకు గట్టి షాక్ తగిలింది. ఆయన ఎంతో కాలంగా ఆశపెట్టుకున్న నరసాపురం ఎంపి టికెట్ దక్కలేదు. అయితే ఆయన నోటి దురుసు కారణంగానే ఆయనకు టికెట్ దక్కలేదని టాక్ వినిపిస్తోంది.

Raghu Rama Raju: టికెట్ దక్కని రఘురామరాజు.. గుడ్డిగా బాబుని నమ్మితే నిలువునా ముంచేశాడు!

రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి అడుగు ఆచితూచి వేయ్యాలి. అదే విధంగా తీసుకునే నిర్ణయం, మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇష్టానుషారంగా నోటికి పని చెబితే.. ఆ తరువాత రాజకీయ భవిష్యత్ చీకటిగా మారుతుంది. అలానే రాజకీయంగా వాడుకునే వాళ్ల విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలి. అలానే లేకపోతే.. చేదు అనుభవం ఎదుర్కోంటారు. ఇప్పటికే ఎంతో మంది తమ నోటి దురుసుతనం కారణంగా రాజకీయాన్ని అంధకారంలో పడేస్తున్నారు. తాజాగా ఆ  జాబితాలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు  చేరారు. ఇటీవలే బీజేపీ ప్రకటించిన జాబితాలో ఆయినకు టికెట్ దక్కలేదు. దీంతో ఆయన తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయి.. ఏకంగా బీజేపీ అధిష్టాంపైనే అసంతృప్తిని వెలగక్కారు. అయితే టికెట్ దక్కకపోవడానికి ఆయన నోటి దూలే కారణమానే టాక్ వినిపిస్తోంది.

“ఈసారి ఎన్నికల్లో నరసాపురం లోక్ సభ స్థానం నుంచి నేను పోటీచేయబోయేది గ్యారంటీ. తప్పకుండా పోటీచేస్తున్నా.. మళ్లీ గెలుస్తా. అయితే ఏ పార్టీ తరఫున పోటీచేస్తాననేది మాత్రం తర్వాత చెప్తాను. నేను మాత్రం ఖచ్చితంగా ఎన్డీయే (విపక్ష) కూటమి తరఫునే పోటీచేస్తున్నా”. ఇలాంటి ఓవరాక్షన్ డైలాగులు గుర్తుకు వస్తే చాలు.. రఘురామక్రిష్ణ రాజు అందరికీ గుర్తుకు వస్తారు. ఇప్పటి వరకు ఏ పార్టీలోకి దూకుదామా  అని గోడ మీద పిల్లిలాగా ఉన్నారు. బీజేపీ టికెట్ ఇస్తుందని చాలా ఆశపడ్డారు. అయితే కమలం పార్టీ ఆయనను నిండా ముంచేసింది. అయితే కమలం పార్టీ కంటే.. రఘరామకృష్ణ స్వయకృపరాధం ఎక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

2019లో నరసాపురం ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం కొద్ది నెలలకే సీఎం జగన్ మోహన్ రెడ్డితో విభేధించి.. ఆ పార్టీకి రెబల్ గా మారారు. ఇక అప్పటి నుంచి నిత్యం సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఇష్టాను సారంగా.. ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా విమర్శలు చేశారు. అంతేకాక తను తాను పెద్ద శక్తిగా ఊహించుకుని నరసాపురం నుంచి తన సొంత క్రేజ్ తోనే గెలిచానంటూ గాంభీర్య మాటలు ప్రదర్శించారు. ఇక చంద్రబాబు పడిన ట్రాప్ లో పడి..  మీడియాల్లో, పలు సభల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డిపై రఘరామ రాజు అనేక ఆరోపణలు చేశారు. తనకు విపక్ష కూటమి నుంచి టికెట్ వస్తాదని నమ్మకంతో వైసీపీ, ఆ పార్టీ నేతలపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.

ఇక సీన్ కట్ చేస్తే.. విపక్ష కూటమి అభ్యర్థులను ప్రకటించే సమయంలో ఆయనకు గట్టి షాక్ తగిలింది. ఆయన ఆశలు పెట్టుకున్న నరసాపురం సీటును శ్రీనివాసవర్మ అనే బీజేపీ నేతకే ఇచ్చారు. దీంతో రఘురామరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ కూడా సీఎం జగన్ నే టార్గెట్ గా మాట్లాడారు. సీఎం జగన్ ఢిల్లీ పెద్దలతో మంతనాలు చేసి తనకు టికెట్ రాకుండా చేశారని ఆరోపించారు. అయితే ఆయన నోటి దూల కారణంగానే టికెట్ దక్కలేదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు.

ఏ పార్టీ అయినా ప్రజల్లో తిరిగే వారికే టికెట్ ఇవ్వాలని భావిస్తుంది.  అంతేకాకని నోరు ఎత్తుకుని ఇష్టానుసారంగా మాట్లాడే వారికి ఇవ్వదు. కేవలం అలాంటి వారిని  వాడుకుని వదిలేస్తుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటి వరకు ఏ  పార్టీ చూసిన ప్రజల్లో తిరిగి, వారి సమస్యల గురించి తెలుసుకునే వారికే ఎక్కువ శాతం ఇచ్చారు. ఛానల్స్ లో, సోషల్ మీడియాల్లో, మీడియా ముందు ఇష్టానుసారంగా మాట్లాడే వారిని కేవలం వాడుకుని వదిలేస్తారని  అభిప్రాయ పడుతున్నారు. తాజాగా రఘరామ రాజు కూడా  ప్రజల్లో తిరగకుండా.. ఎంపీ గెలిచిన దగ్గర నుంచి ఢిల్లీలోనే కూర్చుని ఉంటే..సీటు ఇచ్చిన గెలవరని విపక్ష కూటమి భావించిందని టాక్. అలానే నమ్మి టికెట్ గెలిపించిన పార్టీకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి, తమను కూడ ఎందుకు వెన్నుపోటు పొడవరు అనే భావనలో విపక్ష కూటమి పార్టీలు కూడా ఆలోచించాయనే టాక్ వినిపిస్తోంది. అలా మొత్తంగా ఆ రఘరామ కృష్ణ రాజు నోటి దూల కారణంగానే టికెట్ దక్కలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి