iDreamPost

‘అల’ వేగానికి బ్రేకులు పడవు

‘అల’ వేగానికి బ్రేకులు పడవు

మొన్న సంక్రాంతి పండగ సందర్భంగా 12న విడుదలైన అల వైకుంఠపురములో ఇప్పటికీ స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తోంది. సరిలేరు నీకెవ్వరుతో పోలిస్తే చాలా మెరుగ్గా ఇప్పటికీ వసూళ్లను రాబడుతోంది. మూడో వారంలో అడుగుపెట్టబోతున్న బన్నీ మూవీకి ఇంకాస్త ఎక్కువ డ్రీం రన్ దక్కేలా ఉంది. నిన్న విడుదలైన డిస్కోరాజాకు పబ్లిక్ టాక్, రివ్యూలు ఏమంత పాజిటివ్ గా లేవు. ఓపెనింగ్స్ బాగానే వచ్చినప్పటికీ ఇప్పుడీ ఫీడ్ బ్యాక్ రేపటి నుంచి ప్రభావం చూపించే అవకాశం ఉంది.

సైంటిఫిక్ థ్రిల్లర్ పేరుతో రొటీన్ మాస్ మాఫియా సినిమా చేయడంతో ఇది ఎవరికి పూర్తిగా నచ్చకుండా పోతోంది. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ కన్నేసే ఛాన్స్ లేదు. ఒకవేళ సూపర్ హిట్ టాక్ వచ్చి ఉంటే ఆ ఎఫెక్ట్ వల్ల ఫెస్టివల్ సినిమాల వసూళ్లు తగ్గేవి. కానీ ఇప్పుడా ఛాన్స్ లేదని తేలిపోయింది. సో ఈ వీకెండ్ తో పాటు ఇంకో వారం మొత్తాన్ని బన్నీ తన కంట్రోల్ లోకి తీసుకోబోతున్నాడు. ఆపై నాగ శౌర్య అశ్వద్ధామ ఉంది కానీ అది క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి మరీ పోటీగా పరిగణించలేం.

ఒకవేళ ఈ శనివారం ఆదివారం కనక మంచి ఫిగర్స్ నమోదు చేస్తే అల లెవెల్ ఇంకాస్త పెరుగుతుంది. మొన్నటి దాకా మేమంటే మేము 200 కోట్లు సాధించామని పోస్టర్లు వేసుకున్న రెండు సినిమాల యూనిట్లు తర్వాత సైలెంట్ అయిపోయాయి. ఈ పోకడ మీద సోషల్ మీడియాలో విమర్శలు కూడా వచ్చాయి. నిజంగా కలెక్షన్స్ వచ్చాయో లేదో కాని ఇలా అంతేసి నెంబర్లు వేసుకోవడం ఏంటని కామెంట్స్ చేశారు నెటిజెన్లు. ఇదలా ఉంచితే డిస్కో రాజా కష్టమే అంటున్నారు కాబట్టి ఇక అల వైకుంఠపురములోకు ఇప్పట్లో బ్రేకులు పడే అవకాశాలు కనిపించడం లేదు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి