iDreamPost
android-app
ios-app

నితీష్‌ కుమార్‌ రెడ్డికి అరుదైన గౌరవం! ఇది తెలుగోడి మరో కొత్త రికార్డ్‌

  • Published May 16, 2024 | 4:27 PM Updated Updated May 16, 2024 | 4:27 PM

Nitish Kumar Reddy, APL 2024, APL Auction: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌తో అదరగొడుతున్న తెలుగోడు.. తాజాగా మరో రికార్డు బద్దులకొట్టాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Nitish Kumar Reddy, APL 2024, APL Auction: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌తో అదరగొడుతున్న తెలుగోడు.. తాజాగా మరో రికార్డు బద్దులకొట్టాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published May 16, 2024 | 4:27 PMUpdated May 16, 2024 | 4:27 PM
నితీష్‌ కుమార్‌ రెడ్డికి అరుదైన గౌరవం! ఇది తెలుగోడి మరో కొత్త రికార్డ్‌

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఓ తెలుగు క్రికెటర్‌ పేరు మారుమోగిపోతుంది. పైగా మన హోం టీమ్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడుతూ.. అద్భుత ప్రదర్శన చేస్తుండటంతో ఇండియన్‌ క్రికెట్‌లో అతనే నెక్ట్స్‌ సూపర్‌ స్టార్‌ అంటూ క్రికెట్‌ అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇంతకీ ఆ క్రికెటర్‌ ఎవరంటే.. నితీష్‌ కుమార్‌ రెడ్డి. ఎస్‌ఆర్‌హెచ్‌లో ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ, హెన్రిచ్‌ క్లాసెన్‌ లాంటి హేమాహేమీల హవా సాగుతున్న టైమ్‌లో తన మార్క్‌ చూపిస్తూ.. వారి మధ్యలో కూడా పేరు తెచ్చుకున్నాడు.

ఐపీఎల్‌లో అతను రాణిస్తున్న తీరు చూసి.. టీమిండియాకు ఎంపిక కావడమే తరువాయి అని క్రికెట్‌ నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలోనే నితీష్ కుమార్‌ రెడ్డి మరో క్రీజీ రికార్డును బ్రేక్‌ చేశాడు. ఐపీఎల్‌ నుంచి స్ఫూర్తి పొంది మన దేశంలోనే లోకల్‌ ప్రీమియర్‌ లీగులు పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. తొలుత తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ బాగా సక్సెస్‌ అయింది. ఆ తర్వాత ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ వచ్చింది. ఇప్పటికే రెండు సీజన్లు కూడా పూర్తి చేసుకుంది ఏపీఎల్‌. మూడో సీజన్‌ కోసం తాజాగా నిర్వహించిన ఏపీఎల్‌ వేలంలో.. నితీష్‌ కుమార్‌ రెడ్డిని గోదావరి టైటాన్స్‌ 15.6 లక్షల ధర పెట్టి కొనుగోలు చేసింది.

ఏపీఎల్‌ చరిత్రలోనే ఓ ఆటగాడికి ఇంత భారీ ధర పెట్టి కొనుగోలు చేయడం ఇదే తొలిసారి. ఏపీఎల్‌ వేలంలో అత్యంత భారీ ధర పలికిన క్రికెటర్‌గా నితీష్‌ కుమార్‌ కొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో కూడా నితీష్‌ కుమార్‌కు రూ.20 లక్షల సంపాదన వస్తోంది. బేస్‌ ప్రైజ్‌కు ఎస్‌ఆర్‌హెచ్‌ గతేడాది కొనుగోలు చేసింది. అయితే.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన నితీష్‌ 47.80 యావరేజ​్‌, 152.23 స్ట్రైక్‌రేట్‌తో 239 పరుగులు చేశాడు. మంచి ఫామ్‌లో ఉన్న నితీష్‌ ఏపీఎల్‌లో అదరగొడతాడని అంతా భావిస్తున్నారు. కాగా ఏపీఎల్‌ వేలంలో తన కొనుగోలు ప్రక్రియను లైవ్‌ చూసిన నితీష్‌.. తనకు దక్కిన ధర చూసి షాక్‌ అయ్యాడు. మరి నితీష్‌కు దక్కిన ధరపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.