iDreamPost

రిలీజులు తొమ్మిది – సందడి ఏదీ?

రిలీజులు తొమ్మిది – సందడి ఏదీ?

మాములుగా రెండు రోజుల్లో తొమ్మిది సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయంటే టికెట్ కౌంటర్ల దగ్గర ఓ రేంజ్ హడావిడి ఉండాలి. దానికి వారం ముందు చిరంజీవి నాగార్జున లాంటి పెద్ద స్టార్ల మూవీస్ ఉంటే ఏ రేంజ్ లో రచ్చ జరగాలో వేరే చెప్పాలా. కానీ పరిస్థితి భిన్నంగా ఉంది. గాడ్ ఫాదర్ అనూహ్యంగా సోమవారం నుంచి విపరీతమైన డ్రాప్ నమోదు చేస్తోంది. మొదటి 5 రోజులు చూపించిన దూకుడులో ఇప్పుడు సగం కూడా లేదు. ది ఘోస్ట్ సంగతి సరేసరి. రిలీజ్ రోజు మార్నింగ్ షో నుంచే నెగటివ్ టాక్ రావడంతో ఏ దశలో పికప్ అయ్యే సూచనలు చూపించలేదు. క్యాస్టింగ్ సమస్య వల్ల స్వాతిముత్యం కూడా ఎదురీదాల్సిన పరిస్థితి నెలకొంది

ఇక ఈ శుక్రవారం అక్టోబర్ 14,15 తేదీల్లో ఏకంగా తొమ్మిది సినిమాలు థియేటర్లలో అడుగు పెట్టబోతున్నాయి. అందులో అంతో ఇంతో చెప్పుకోదగ్గ అంచనాలు ఉన్నది ఒక్క కన్నడ డబ్బింగ్ ‘కాంతారా’కు మాత్రమే. శాండల్ వుడ్ లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ విలేజ్ డ్రామాను తెలుగులో కొంత ఆలస్యంగా శనివారం విడుదల చేస్తున్నారు. బుకింగ్స్ ఏమంత జోరుగా లేవు కానీ టాక్ బాగా వస్తే 777 ఛార్లీ తరహాలో సర్ ప్రైజ్ హిట్ అయినా ఆశ్చర్యం లేదు. కాకపోతే ఆ నేటివిటీ వగైరా మన ప్రేక్షకులకు కనెక్ట్ కావాలి. ఆది సాయికుమార్ ‘crazy fellow’కి ప్రమోషన్లు బాగానే చేస్తున్నారు కానీ అవి ఓపెనింగ్స్ మారడం అనుమానమే చాలా బాగుందనే టాక్ పబ్లిక్ నుంచి వస్తే తప్ప

ఏడాదికి పైగా ల్యాబులో ఉన్న ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ని ఫ్రైడే ప్యాకేజీలో వదులుతున్నారు. హైప్ కోసం కాలేజీలు గట్రా తిరుగుతున్నారు కానీ ఏ మేరకు జనం దీని వైపు మొగ్గు చూపుతారో అనుమానమే. కెజిఎఫ్ యష్ నటించిన ఓ పాత కన్నడ మూవీని ‘రారాజు’ పేరుతో బిజినెస్ చేశారు. ఇక్కడ హీరో ఇమేజ్ వసూళ్లు తెస్తుందనుకోవడం అమాయకత్వమే. గీత, నా వెంటపడుతున్న చిన్నవాడెవరమ్మా, నిన్నే పెళ్లాడతా, రుద్రనేత్రి. నీతో ఇలా మొత్తం హోల్ సేల్ సరుకంతా వచ్చేస్తోంది. ఏ ఒక్కటీ కనీసం మార్నింగ్ షోని సగం నింపినా గొప్పే. ఓటిటి కండీషన్ కోసమో లేక ఇంకేం కారణమో కానీ వీటిలో ఎన్ని నెగ్గుకొస్తాయో లెట్ వెయిట్ అండ్ సీ