iDreamPost
android-app
ios-app

Niharika Konidela: ఐయామ్‌ జస్ట్‌ 30.. రెండో పెళ్లి కచ్చితంగా చేసుకుంటా: నిహారిక

  • Published Jan 26, 2024 | 11:36 AM Updated Updated Jan 30, 2024 | 12:24 PM

సినిమా నటి, మెగా ఇంటి ఆడబిడ్ద నిహారిక కొణిదెల రెండో పెళ్లికి సిద్ధంగానే ఉన్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఈ సందర్భంగానే తన మొదటి పెళ్లి, విడాకుల గురించి మాట్లాడుతూ.. కాస్త ఎమోషనల్‌ అయింది. వాటికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

సినిమా నటి, మెగా ఇంటి ఆడబిడ్ద నిహారిక కొణిదెల రెండో పెళ్లికి సిద్ధంగానే ఉన్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఈ సందర్భంగానే తన మొదటి పెళ్లి, విడాకుల గురించి మాట్లాడుతూ.. కాస్త ఎమోషనల్‌ అయింది. వాటికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 26, 2024 | 11:36 AMUpdated Jan 30, 2024 | 12:24 PM
Niharika Konidela: ఐయామ్‌ జస్ట్‌ 30.. రెండో పెళ్లి కచ్చితంగా చేసుకుంటా: నిహారిక

సినీ నటుడు, జనసేన నేత నాగబాబు కుమార్తె నిహారిక తన వ్యక్తిగత జీవితం గురించి సంచలన విషయాలను వెల్లడించారు. నిహారిక కొణిదెల కూడా సినిమా రంగంలోనే ఉన్న విషయం తెలిసిందే. అయితే.. ఆమె చైతన్యను వివాహం చేసుకుని ఆ తర్వాత విడాకులు తీసుకున్న విషయం కూడా తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక తన వ్యక్తిగత జీవితం గురించి, విడాకుల తీసుకున్న తర్వాత వాటి గురించి తొలి సారి స్పందించారు. జీవితంలో పెళ్లి, విడాకులు అనేవి చిన్న విషయాలు కావని, అయినా ఆ సమయంలో తాను ఎలాంటి కఠిన పరిస్థితి ఎదుర్కొన్నానో తనకు మాత్రమే తెలుసని, చూసేవారికి ఏం తెలుసని అన్నారు. అలాంటి టఫ్‌ కండీషన్‌లో తనకు కుటుంబం విలువేంటో తెలిసొచ్చిందని కూడా నిహారిక పేర్కొన్నారు. ఆ సమయంలో తల్లిదండ్రులు మాత్రమే మన కోసం నిలబడతారని తెలిపారు. విడాకుల సమయంలో తన తండ్రి నాగబాబు చాలా సపోర్ట్‌ చేశారని వెల్లడించారు. అయినా ఎవరూ కూడా పెళ్లి పెటాకులు అవుతుందని చేసుకోరని, కానీ, కొన్ని సార్లు అలా జరిగిపోతుందని అన్నారు.

అలాగే మళ్లీ పెళ్లి చేసుకోవడంపై కూడా నిహారిక స్పందించారు. జీవితంలో నెక్ట్స్‌ ఏంటని హోస్ట్‌ నుంచి వచ్చిన ప్రశ్నకు.. నిహారిక బదులిస్తూ.. హోప్‌ ఫుల్లీ, తనకింకా 30 ఏళ్లు మాత్రమే అంటూ బదులిచ్చారు. రెండో పెళ్లి చేసుకోవడానికి తనకేమి అభ్యంతరం లేదని, చేసుకోవద్దని బలంగా ఫిక్స్‌ అవ్వలేదనే విషయాన్ని నిహారిక స్పష్టం చేశారు. మళ్లీ పెళ్లి చేసుకుని, వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు తాను సుముఖంగానే ఉన్నట్లు వెల్లడించారు. తన హృదయాన్ని ముసివేయలేదని చెప్పి నవ్వులు పూయించారు. అలాగని.. పెళ్లి కోసం తాను పరుగులు పెట్టడం లేదని, ఎవర్ని చేసుకోవాలని ఎవర్ని చేసుకోవాలంటూ తాను పెళ్లి వెంట పడననని అన్నారు. భవిష్యత్తులో మళ్లీ పెళ్లి చేసుకుంటానని కూడా ఈ సందర్భంగా నిహారిక స్పష్టం చేశారు. చాలా మంది విడాకుల తర్వాత మళ్లీ పెళ్లి గురించి మాట్లాడితే.. ఛీ ఛీ మళ్లీ పెళ్లి జోలికి వెళ్లం, అలాంటి తలనొప్పిని భరించాలని తమకు లేదని అంటూ ఉంటారు. కానీ, నిహారిక మాత్రం ఎంతో హుందాగా, మెచ్యూర్‌గా సమాధానం ఇవ్వడంపై నెటిజన్లు సైతం సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

ఇక ఈ విషయాలతో పాటు పలు ఆసక్తికర అంశాలపై కూడా నిహారిక తన అభిప్రాయాలను వెల్లడించారు. 2024 ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దుతు తెలుపుతారు, ఎవరికి ఓటు వేస్తారనే విషయాలపై కూడా నిహారిక తన నిర్ణయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే విడాకుల సమయంలో తన తండ్రి నాగబాబు తన కోసం నిలబడిన విధానం గురించి నిహారిక చెప్పిన విషయాలు కంటతడి పెట్టించేలా ఉన్నాయి. ఒక తండ్రి తన కూతురి కోసం ఎంత దూరమైనా వెళ్తాడు, ఏమైనా చేస్తాడనే దానికి అవి నిదర్శంగా కనిపిస్తున్నాయని నెటిజన్లు ఆ వీడియోకి కామెంట్స్‌ పెడుతున్నారు. మరి నిహారిక రెండో పెళ్లి చేసుకుంటా అని స్పష్టతనివ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişHoliganbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişHoliganbet Girişmadridbet güncel girişmadridbet