iDreamPost

అఫీషియల్‌.. విడాకులు తీసుకున్న నిహారిక- చైతన్య!

అఫీషియల్‌.. విడాకులు తీసుకున్న నిహారిక- చైతన్య!

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య అధికారికంగా విడిపోయారు. ఈ జంట పరస్పర విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేశారు. కోర్టు కూడా వీరికి విడాకులు మంజూరు చేసింది. గత కొంతకాలంగా దూరంగా  ఉంటున్న వీరు.. మ్యూచవల్ అంగీకారంతో  విడాకులు తీసుకునేందుకు మే 19న ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశారు. ఇక నిహారిక పెళ్లి విషయానికి వస్తే.. జొన్నల గడ్డ చైతన్యతో 2020 డిసెంబర్ 9వ తేదీన వివాహం జరిగింది. రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్ లో నిహారిక, చైతన్యల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

 అయితే పెళ్లన రెండేళ్లకే వీరి ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో గత కొంతకాలం వేర్వేరుగా ఉంటున్నారు నిహారిక- చైతన్య.  కొన్ని రోజుల క్రితం చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ నుంచి నిహారిక ఫొటోలన్నింటినీ తొలగించాడు. దీంతో తొలిసారిగా వీరి బ్రేకప్‌ వార్తలు తెరపైకి వచ్చాయి. ఆ తర్వాత కొన్ని రోజులకు నిహారిక కూడా తన ఇన్ స్టాగ్రామ్ లో చైతన్య ఫొటోలన్నింటినీ తొలగించింది. ఆ తర్వాత మెగా ఫ్యామిలీలో జరిగిన ఫంక్షన్లకు నిహారిక సింగిల్‌గా రావడంతో వీరి విడాకుల  రూమర్స్ కు మరింత బలం చేకూరింది. తాజాగా అదే వార్త నిజమై.. నిహారిక- చైతన్య దంపతులు అధికారికంగా విడిపోయారు.