iDreamPost

Nicholas Pooran: వరల్డ్ కప్ కు ఊపు తెచ్చిన పూరన్ మెరుపు ఇన్నింగ్స్! ఆఫ్గాన్ బౌలర్ల ఊచకోత..

వన్డే, టెస్ట్ క్రికెట్ ను తలపిస్తూ సాగుతున్న టీ20 వరల్డ్ కప్ కు తన మెరుపు బ్యాటింగ్ తో ఊపు తెచ్చాడు విండీస్ స్టార్ ప్లేయర్ నికోలస్ పూరన్. తాజాగా ఆఫ్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో తన విశ్వరూపం చూపించాడు.

వన్డే, టెస్ట్ క్రికెట్ ను తలపిస్తూ సాగుతున్న టీ20 వరల్డ్ కప్ కు తన మెరుపు బ్యాటింగ్ తో ఊపు తెచ్చాడు విండీస్ స్టార్ ప్లేయర్ నికోలస్ పూరన్. తాజాగా ఆఫ్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో తన విశ్వరూపం చూపించాడు.

Nicholas Pooran: వరల్డ్ కప్ కు ఊపు తెచ్చిన పూరన్ మెరుపు ఇన్నింగ్స్! ఆఫ్గాన్ బౌలర్ల ఊచకోత..

చప్పగా సాగుతున్న టీ20 వరల్డ్ కప్ కు ఇప్పుడిప్పుడే ఊపు వచ్చినట్లుగా కనిపిస్తోంది. బ్యాటర్లు క్రమంగా తమ బ్యాట్లకు పనిచెబుతున్నారు. దాంతో చివరి లీగ్ మ్యాచ్ ల్లో భారీ స్కోర్లు నమోదు అవుతున్నాయి. ఇన్ని రోజులు అమెరికా పిచ్ లపై పరుగులు రాబట్టడానికి నానా కష్టాలు పడ్డ బ్యాటర్లు.. తమ బ్యాట్లకు పనిచెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆఫ్గానిస్తాన్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో జూలు విదిల్చింది వెస్టిండీస్ టీమ్. ఆ జట్టు స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్ తో జట్టుకు భారీ స్కోర్ తో పాటుగా భారీ విజయాన్ని కూడా అందించాడు.

వన్డే, టెస్ట్ క్రికెట్ ను తలపిస్తూ సాగుతున్న టీ20 వరల్డ్ కప్ కు తన మెరుపు బ్యాటింగ్ తో ఊపు తెచ్చాడు విండీస్ స్టార్ ప్లేయర్ నికోలస్ పూరన్. ఆఫ్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ 104 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో ఆఫ్గాన్ బౌలర్లను ఊచకోత కోశాడు నికోలస్ పూరన్. ఐపీఎల్ 2024లో చూపించిన ఫామ్ నే ఇక్కడా కొనసాగిస్తున్నాడు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ కు రెండో ఓవర్లోనే షాకిచ్చాడు అజ్మతుల్లా. ఓపెనర్ బ్రెండన్ కింగ్(7) ను బౌల్డ్ చేశాడు. దాంతో ఆఫ్గాన్ జట్టులో సంతోషం వెళ్లివిరిసింది. అయితే ఆ సంతోషం ఎంతో సేపు నిలపలేదు నికోలస్ పూరన్. బ్యాటింగ్ కు వచ్చీ రావడంతోనే ప్రత్యర్థి బౌలర్లపై సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. మరీ ముఖ్యంగా అజ్మతుల్లా వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్లో తన విశ్వరూపం చూపించాడు. ఈ ఓవర్లో వరుసగా 6, N4, Wd5, 0, L4, 4, 6, 6 బాది ఏకంగా 36 పరుగులు పిండుకున్నాడు. ఇందులో పూరన్ 26 రన్స్ దంచికొట్టాడు.

ఇక ఈ మ్యాచ్ లో పూరన్ 53 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 98 పరుగులు చేసి చివరి ఓవర్లో రనౌట్ గా వెనుదిరిగాడు. దాంతో రెండు పరుగులతో తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. పూరన్ తో పాటుగా చార్లెస్(43), షై హోప్(25), పావెల్(26) పరుగులతో రాణించడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అనంతరం 219 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆఫ్గాన్ 16.2 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. దాంతో 104 పరుగుల భారీ తేడాతో విండీస్ విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో 8 సిక్సులు బాదడం ద్వారా విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ రికార్డ్ ను బ్రేక్ చేశాడు పూరన్. వెస్టిండీస్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సులు కొట్టిన ప్లేయర్ గా పూరన్ నిలిచాడు. మరి తన మెరుపు ఇన్నింగ్స్ తో చప్పగా సాగుతున్న టీ20 వరల్డ్ కప్ కు ఊపు తెచ్చిన నికోలస్ పూరన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి