iDreamPost

పేటీఎం ఫాస్టాగ్ యూజర్లకు NHAI వార్నింగ్.. ప్రత్యామ్నాయం చూసుకోండంటూ..!

  • Published Mar 13, 2024 | 8:47 PMUpdated Mar 13, 2024 | 8:47 PM

పేటీఎం ఫాస్టాగ్ యూజర్లకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వార్నింగ్ ఇచ్చింది. అసలు ఎన్​హెచ్​ఏఐ ఎందుకు హెచ్చరించిందో ఇప్పుడు తెలుసుకుందాం..

పేటీఎం ఫాస్టాగ్ యూజర్లకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వార్నింగ్ ఇచ్చింది. అసలు ఎన్​హెచ్​ఏఐ ఎందుకు హెచ్చరించిందో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Mar 13, 2024 | 8:47 PMUpdated Mar 13, 2024 | 8:47 PM
పేటీఎం ఫాస్టాగ్ యూజర్లకు NHAI వార్నింగ్.. ప్రత్యామ్నాయం చూసుకోండంటూ..!

పేటీఎం ఫాస్టాగ్ వినియోగదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్​హెచ్​ఏఐ) వార్నింగ్ ఇచ్చింది. యూజర్లు వెంటనే ఇతర ఫాస్టాగ్ సంస్థలకు మారిపోవాలని తెలిపింది. పేటీఎం పేమెంట్ బ్యాంక్ (పీపీబీఎల్)కు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్​బీఐ) ఇచ్చిన నిర్దేశిత గడువు మరో రెండ్రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్​హెచ్​ఏఐ కీలక ప్రకటన చేసింది. దీని వల్ల ప్రయాణాలు చేసే సమయంలో టోల్​ప్లాజాల దగ్గర ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవని కోరింది. ఇక, పేటీఎం మీద ఆర్​బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా గత నెలలో ఫాస్టాగ్ జారీ చేసే బ్యాంకుల లిస్టులో నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్​ను ఇండియన్ హైవే మేనేజ్​మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్​ఎంసీఎల్) తొలగించింది. ఇక మీదట ఐహెచ్​ఎంసీఎల్ పేర్కొన్న జాబితాలో ఉన్న బ్యాంకుల నుంచే ఫాస్టాగ్ కొనుగోలు చేయాలని వినియోగదారులకు సూచించింది.

ఐహెచ్​ఎంసీఎల్ పేర్కొన్న జాబితాలో ఎయిర్​టెల్ పేమెంట్స్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్​బీఐ, యస్ బ్యాంక్ సహా మొత్తం 32 బ్యాంకులు ఉన్నాయి. పీపీబీఎల్​ మీద ఆర్​బీఐ విధించిన ఆంక్షలు మార్చి 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ఓసారి గడువు తేదీని ఎక్స్​టెండ్ చేశారు. అయితే ఈసారి అలాంటి ఉద్దేశం ఏదీ లేదని ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. దీంతో పేటీఎం వాలెట్, రీఫండ్, డిపాజిట్, పీపీబీఎల్, ఫాస్టాగ్ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయం చూసుకోవాలని ఎన్​హెచ్​ఏఐ వినియోగదారులకు సూచించింది. ఎన్​హెచ్​ఏఐ సూచనల నేపథ్యంలో చాలా మంది పేటీఎం ఫాస్టాగ్​ను డీయాక్టివేట్ చేసుకుంటున్నారు. ఈ డీయాక్టివేషన్ ప్రక్రియ ఎలా ఉంటుందో ఇప్పడు తెలుసుకుందాం..

  • పేటీఎం యాప్ సెర్చ్​లో ఫాస్టాగ్ అని టైప్ చేయాలి. అనంతరం కిందకు స్క్రోల్ చేస్తే పీపీబీఎల్ సెక్షన్ వస్తుంది. అక్కడ మేనేజ్ ఫాస్టాగ్ ఐకాన్ కనిపిస్తుంది.
  • మేనేజ్ ఫాస్టాగ్ ఐకాన్ మీద క్లిక్ చేసి కిందకు స్క్రోల్ చేసి హెల్ప్ అండ్ సపోర్ట్ సెక్షన్​లోకి వెళ్లాలి. అందులో నీడ్ హెల్ప్ మీద క్లిక్ చేస్తే చాట్ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఐ వాంట్ టు క్లోజ్ ఫాస్టాగ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు వచ్చే సూచనల్ని అనుసరించి డీయాక్టివేట్ చేయొచ్చు.
  • ఇలా కాకుండా ఇంకో పద్ధతి కూడా ఉంది. పేటీఎం కస్టమర్ కేర్​కు కాల్ చేసి మొబైల్ నంబర్, వెహికిల్ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఫాస్టాగ్ ఐడీ నమోదు చేయాలి. ఆ తర్వాత పీపీబీఎల్ ప్రతినిధి మీకు ఫోన్ చేసి డీయాక్టివేట్ ఎలా చేయాలో చెబుతారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి