iDreamPost
android-app
ios-app

TRP టార్గెట్ చేరుకున్న యంగ్ టైగర్

  • Published Sep 03, 2021 | 9:54 AM Updated Updated Sep 03, 2021 | 9:54 AM
TRP టార్గెట్ చేరుకున్న యంగ్ టైగర్

భారీ అంచనాల మధ్య జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా మొదలైన ఎవరు మీలో కోటీశ్వరులు షో మొదటి లాంచింగ్ ఎపిసోడ్ మంచి రేటింగ్ దక్కించుకుంది. 11.4 తో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. గతంలో వచ్చిన నాలుగు సీజన్ల కంటే ఇది చాలా ఎక్కువ. ఫస్ట్ సిరీస్ 9.7, రెండో భాగం 8.2, మూడో సీజన్ 6.72, నాలుగో సిరీస్ 3.62తో చాలా తక్కువ నమోదు చేయగా యంగ్ టైగర్ మాత్రం ఏకంగా ఫస్ట్ టైం రికార్డు నమోదు చేయడం విశేషం. రామ్ చరణ్ అతిధిగా రావడం, తారక్ షోని ఎలా హోస్ట్ చేస్తాడా అనే పాయింట్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి రేపడం ఈ రేటింగ్స్ కి కారణం అయ్యాయి. ఆర్ఆర్ఆర్ కాంబినేషన్ కావడంతో అభిమానులు ఎగబడి చూశారు.

దీంతో పాటే మొదలైన తమన్నా మాస్టర్ చెఫ్ మాత్రం 5 లోపే రేటింగ్ తెచ్చుకుని జస్ట్ ఓకే అనిపించుకుంది. అయితే ఇదంతా ఇలాగె కొనసాగుతుందని చెప్పడానికి లేదు. ఎవరు మీలో కోటీశ్వరులు వీక్ డేస్ లో ఎలా పెర్ఫార్మ్ చేయబోతుందన్నది ఇక్కడ కీలకంగా మారబోతోంది. రెగ్యులర్ పార్టిసిపెంట్స్ పట్ల ఆడియన్స్ అంతగా ఆసక్తి చూపించరు. ఏవైనా అనూహ్యమైన సంఘటనలు జరుగుతూ ఉండాలి. వచ్చిన వాళ్ళ బ్యాక్ గ్రౌండ్, ఎమోషన్స్ ఇవన్నీ కీలక పాత్ర పోషిస్తాయి. దానికి తగ్గట్టే జెమిని ఛానల్ బాగానే డిజైన్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. దీని తాలూకు ప్రభావం వాటి తాలూకు రేటింగ్స్ వచ్చాకే బయట పడుతుంది.

ఇక్కడి దక్షిణాది ప్రేక్షకుల్లో ఇలాంటి క్విజ్ షోల పట్ల ఆసక్తి బాగా తగ్గిపోయింది. జబర్దస్త్, ఢీ, క్యాష్ లాంటి పరుగులు పెడుతూ నవ్వించే ప్రోగ్రాములతో పోలిస్తే ప్రశ్నలు జవాబులతో సాగే ఎవరు మీలో కోటీశ్వరులు లాంటివి ఆకట్టుకోవడం అంత సులభం కాదు. అందుకే రాబోయే రోజుల్లో సెలబ్రిటీ గెస్టుల అవసరం చాలా ఉంటుంది. దానికి తగ్గట్టే జెమిని కూడా ప్లానింగ్ లో ఉన్నట్టు సమాచారం. ఎలాగూ సినిమాల రిలీజు టైంలో ఆయా యూనిట్ల హీరోలు హీరోయిన్లు ఇలాంటి వాటిలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తారు. తారక్ వ్యాఖ్యాత కాబట్టి గట్టి హంగామానే చేయొచ్చు. చూడాలి మరి ఈ రేటింగ్స్ లో ఎలాంటి హెచ్చుతగ్గులు ఉంటాయో

Also Read : 101 జిల్లాల అందగాడు రిపోర్ట్

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alKulisbetKulisbetMadridbetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş