iDreamPost
android-app
ios-app

మహేష్ ఆ కాంబోకి ఒప్పుకుంటారా

  • Published Aug 25, 2020 | 10:04 AM Updated Updated Aug 25, 2020 | 10:04 AM
  • Published Aug 25, 2020 | 10:04 AMUpdated Aug 25, 2020 | 10:04 AM
మహేష్ ఆ కాంబోకి ఒప్పుకుంటారా

సర్కారు వారి పాట రెగ్యులర్ షూటింగ్ కోసం ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు దాని తర్వాత రాజమౌళితో చేస్తారా లేక ఇంకో దర్శకుడు ఎవరైనా ఉన్నారా అనే క్లారిటీ ప్రస్తుతానికి లేదు. అయితే స్పైడర్ తో నిరాశపరిచిన మురుగదాస్ కు మరో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని నిన్నటి నుంచి గట్టిగానే ప్రచారం అవుతోంది. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇప్పుడిది సాధ్యం కాదు. ఎందుకంటే మురుగదాస్ విజయ్ కు కమిట్ అయ్యాడు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా ఓ కొలిక్కి వస్తోంది. లాక్ డౌన్ కాగానే అఫీషియల్ గా సెట్స్ పైకి తీసుకెళ్తారు. మొదటిసారి తమన్ విజయ్ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు.

విజయ్-మురుగ కాంబినేషన్లో ఇప్పటిదాకా కత్తి, తుపాకీ, సర్కార్ మూడు బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఇప్పుడు నాలుగో మూవీని వాటిని మించే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట. హీరోయిన్ గా రష్మిక మందన్నను తీసుకోవచ్చనే ప్రచారం గట్టిగా జరుగుతోంది కానీ ఇంకా అధికారికంగా బయటికి రాలేదు. మరోవైపు మహేష్ బాబు సర్కారు వారి పాట పూర్తి చేసే లోపు 2021 వేసవి వచ్చేస్తుంది. ఆలోగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఫినిష్ అయితే ఇద్దరూ కలవొచ్చు. కానీ జరిగే ఛాన్స్ తక్కువే. జక్కన్న ఏదీ తొందరపడి చేయడు. టైం ఎక్కువ తీసుకున్నా పాన్ ఇండియా లెవెల్ లో అన్ని ఉన్నాయో లేదో చెక్ చేసుకుని బరిలో దిగుతాడు.

అందుకే అంత దాకా వెయిట్ చేయకుండా ప్రిన్స్ ఈలోగా సందీప్ రెడ్డి వంగాతో ఓ ప్రాజెక్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు. మహర్షితో సూపర్ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి కూడా వెయిటింగ్ లో ఉన్నాడు. ఈ ఇద్దరినీ కాదని ఇంకో ఛాయస్ తీసుకోవడం అనుమానమే. అందుకే మహేష్ మురుగదాస్ కాంబో వార్తకు ఎలాంటి ఆధారం లేదని చెప్పొచ్చు. అసలే మురుగదాస్ కు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు అచ్చి రావడం లేదు. చిరంజీవి స్టాలిన్ ఫ్లాప్ కాగా దాన్ని మించి స్పైడర్ బోల్తా కొట్టింది. ఆ కథల విషయంలో తనదే పొరపాటని మరొక్కసారి మహేష్ ఛాన్స్ ఇస్తే ప్రూవ్ చేసుకుంటానని ఓ ఇంటర్వ్యూలో దాస్ చెప్పాడు. కానీ రజనికాంత్ దర్బార్ ని డీల్ చేసిన విధానం చూస్తే మునుపటి మేజిక్ చేయగలరు అంటే నమ్మడం కొంచెం కష్టమే.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİ