iDreamPost
android-app
ios-app

మహేష్ అందంతో పోటీ పడగలదా

  • Published May 10, 2020 | 1:43 PM Updated Updated May 10, 2020 | 1:43 PM
మహేష్ అందంతో పోటీ పడగలదా

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు హీరోయిన్ సెట్ చేసుకోవడంలో దర్శకులు పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. అసలే బాబు పాలు గారే స్కిన్ టోన్ తో అబ్బాయిలు సైతం ఈర్ష్యపడేలా మెరిసిపోతూ ఉంటాడు. సంతూర్ సోప్ యాడ్ లో నటిస్తాడన్న మాటేగాని నిజంగా ఎప్పుడు చూసినా తన వయసుని పదేళ్లు వెనక్కు వెళ్లినట్టు కనిపించడం మహేష్ ప్రత్యేకత. అందుకే టక్కరి దొంగతో మొదలుకుని భరత్ అనే నేను దాకా చాలా సార్లు బాలీవుడ్ భామలను తీసుకురావాల్సి వచ్చింది.

మహర్షికి పూజాతో సరిలేరుకి రష్మికతో మేనేజ్ చేశారు కానీ ఇప్పుడు పరశురామ్ డైరెక్షన్ లో రూపొందబోయే చిత్రానికి హీరోయిన్ ని సెట్ చేయడం సవాల్ గా మారిందట. ముందు కియారా అద్వానీనే అనుకున్నారు. ఎలాగూ ప్రూవ్ అయినా కాంబినేషన్ కాబట్టి ఈజీగా ఉంటుందనే నమ్మకంతో. మరి హిందీ ఆఫర్లతో బిజీగా ఉందో లేక సౌత్ మీద ఆసక్తి లేకనో మొత్తానికి నో చెప్పిందని ఇన్ సైడ్ టాక్. ఇక ఇప్పుడు కీర్తి సురేష్ పేరు వినిపిస్తోంది. ప్రాధమిక చర్చలు కూడా జరిగాయట. అయితే తన డైరీ చాలా రైట్ గా ఉంది. నితిన్ రంగ్ దే బాలన్స్ షూటింగ్ పెండింగ్ ఉంది. అదే హీరోతో పవర్ పేట కూడా ఒప్పుకున్నట్టు ఇప్పటికే టాక్ ఉంది. గుడ్ లక్ సఖి అనే మరో మూవీ కూడా లైన్ లో ఉంది.

మిస్ ఇండియా షూటింగ్ అయిపోయింది కాబట్టి ఇబ్బంది లేదు. మరోవైపు రెండు తమిళ ప్రాజెక్ట్స్ లో కూడా ఓకే అయ్యింది. ఇంత బిజీలో మహేష్ సినిమాకు డేట్స్ ఇవ్వడం సంగతి పక్కనపెడితే మహేష్ అందం ముందు కీర్తి సురేష్ ఎలా కనిపిస్తుందనే ఊహాగానాలు మొదలైపోయాయి. పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి చేసింది కానీ అందులో చెప్పుకోదగ్గ కెమిస్ట్రీని త్రివిక్రమ్ డిజైన్ చేయలేదు కాబట్టి అందరూ మర్చిపోయారు. కీర్తి సురేష్ అయితే కళగా ఉండే సహజమైన అందమే తప్ప కృత్రిమత్వం ఎక్కడా ఉండదు. దీనికి సంబంధించిన క్లారిటీ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన ఈ నెల 31న చేసే అవకాశం ఉంది.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetMarsbahisgalabetHoliganbet