iDreamPost
android-app
ios-app

బడ్జెట్ చిక్కుల్లో నాని దసరా ?

  • Published Jun 29, 2022 | 4:22 PM Updated Updated Jun 29, 2022 | 4:22 PM
బడ్జెట్ చిక్కుల్లో నాని దసరా ?

న్యాచురల్ స్టార్ నాని హీరోగా ఊర మాస్ గెటప్ లో రూపొందుతున్న దసరా షూటింగ్ కి బ్రేక్ పడినట్టు ఫిలిం నగర్ టాక్. బడ్జెట్ కంట్రోల్ తప్పిపోవడంతో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు నిర్మాతలు చిన్న విరామం ఇచ్చారట. కేవలం రెండు పాటలు ఒక యాక్షన్ ఎపిసోడ్ కే అయిదు కోట్ల దాకా ఖర్చయిపోవడంతో నెక్స్ట్ ఇంకెంత అవుతుందోననే టెన్షన్ మొదలైనట్టు సమాచారం. అధికారికంగా బయటికి చెప్పలేదు కానీ దసరా చిత్రీకరణ ఆగిన మాట వాస్తవం. అంటే సుందరానికి ప్రమోషన్లు పూర్తయ్యాక కూడా నాని ఖాళీగానే ఉన్నాడు. పైగా ప్రత్యేకంగా దసరా కోసమే పెంచిన జుత్తు, మీసకట్టు అది పూర్తయ్యేదాకా మార్చుకునే ఛాన్స్ లేదు.

శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతున్న దసరాలో కీర్తి సురేష్ హీరోయిన్. డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటిదాకా నాని టచ్ చేయని జానర్ ని ఎంచుకున్నారు. అయితే ఇప్పుడీ బడ్జెట్ ఇష్యూస్ వల్ల లేట్ అవుతుందా లేదానేది తెలియాల్సి ఉంది. నాని మార్కెట్ గత కొన్నేళ్లుగా మినిమమ్ లెవల్ నుంచి కిందకు వచ్చేసింది. అంటే సుందరానికి అందరూ బాగానే ఉందన్నా ఖచ్చితంగా రావాల్సిన ఫ్యామిలీ ఆడియన్స్ పూర్తిగా టర్న్ అవ్వలేదు. శ్యామ్ సింగ రాయ్ హిట్ అయినా మరీ గొప్పగా చెప్పుకునే బ్లాక్ బస్టర్ కాదు. అంతకు ముందు వి, టక్ జగదీష్ లు డైరెక్ట్ ఓటిటిలో వచ్చినా కూడా కంటెంట్ మీద గట్టి విమర్శలు ఎదురుకోవాల్సి వచ్చింది.

సో నాని మీద పదుల సంఖ్యలో కోట్లు ఖర్చు పెట్టుకుంటూ పోలేం. ఇప్పుడు దసరా నిర్మాతలు కాస్ట్ కటింగ్ మీద ఉన్నట్టు వినికిడి. గతంలో శ్యామ్ సింగ్ రాయ్ కు ఇదే తరహా ఇబ్బంది ఎదురైనప్పుడు ప్రొడ్యూసర్ మారారు. ఇప్పుడేం జరుగుతుందో చూడాలి. కొత్త దర్శకుడితో అంత రిస్క్ కు సిద్ధపడినప్పుడు ముందే దానికి ప్రిపేర్ అవ్వాలి. అంతే తప్ప కొంత భాగం అయ్యాక ఇలా చేయడం వల్ల అందరికీ ట్రబులే. నాని ప్రస్తుతానికి దీని గురించి మాట్లాడ్డం లేదు. ఈ ఏడాది విడుదల ఉంటుందో లేదో కూడా చెప్పలేం. ఒకవేళ త్వరగా మొదలుపెడితే అక్టోబర్ కి టార్గెట్ చేసుకోవచ్చు. టైటిల్ దసరానే కానీ దసరా పండక్కు వచ్చే అవకాశం లేదు.

marsbahis girişjojobetjojobet giriş