iDreamPost
android-app
ios-app

చైతు ప్రేమకథకు మోక్షం ఎప్పుడు

  • Published Aug 28, 2021 | 9:25 AM Updated Updated Aug 28, 2021 | 9:25 AM
చైతు ప్రేమకథకు మోక్షం ఎప్పుడు

నాగ చైతన్య లవ్ స్టోరీకి మళ్ళీ వాయిదా తప్పకపోవచ్చని లేటెస్ట్ అప్ డేట్. సెప్టెంబర్ 10 ఓటిటి రిలీజ్ కు టక్ జగదీష్ కట్టుబడటంతో పాటు ఏపిలో సెకండ్ షోలు లేకపోవడం, టికెట్ ధరల విషయం తేలకపోవడం వంటి కారణాల వల్ల నిర్మాత మరో ఆప్షన్ చూస్తున్నారని ఇన్ సైడ్ టాక్. వచ్చే నెల చివరిలో లేదా అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందన్న కోణంలో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అక్టోబర్ 13 నుంచి 15 మంచి డేట్లు ఉన్నప్పటికీ ఆల్రెడీ మహాసముద్రం 14ని తీసేసుకుంది. దానికన్నా ముందు 8న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కర్చీఫ్ చేసింది. సో లేట్ చేసే కొద్దీ వేరే సినిమాలు లాగేసుకుంటాయి.

అలా అని అక్టోబర్ మొదటి వారం ఖాళీగా ఏమి లేదు. రిపబ్లిక్, కొండపోలం లాంటివి ఉన్నాయి. మరికొన్ని అనౌన్స్ మెంట్లు కొద్దిరోజుల్లో రాబోతున్నాయి. అలాంటప్పుడు లవ్ స్టోరీ టీమ్ తొందరపడకపోతే ఇబ్బందులు తలెత్తున్నాయి. అసలే దీని ప్రొడ్యూసర్ సునీల్ నారంగ్ ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో సినిమాలను బ్రతికించుకుందాం థియేటర్లు ముఖ్యం అన్నట్టుగా చెప్పారు. సో అవాంఛనీయమైన పోటీకి ఆయనే అవకాశం ఇవ్వకూడదు. అంటే ఆల్రెడీ ప్రకటించుకున్న సినిమాలకు గౌరవం ఇస్తూ వేరే మంచి డేట్ చూసుకోవాలన్న మాట. అయితే ఇది అనుకున్నంత ఈజీ కాదు. పెద్ద పజిల్ గా మారిపోయింది.

ఇప్పటికే విపరీతమైన ఆలస్యం జరిగిన లవ్ స్టోరీని వచ్చే నెల 10 నుంచి తప్పించబోతున్నారన్న వార్తల పట్ల అభిమానులు అంత సంతోషంగా ఏమీ లేరు. టాక్ బాగా వస్తే సగం ఆక్యుపెన్సీ ఉన్నా సెకండ్ షోలు లేకపోయినా కలెక్షన్లు వస్తాయని వాళ్ళ నమ్మకం. కానీ ప్రొడ్యూసర్ వర్షన్ వేరేలా ఉన్నట్టుంది. మొత్తానికి నాగ చైతన్య సినిమాకు గట్టి చిక్కే వచ్చి పడింది. శేఖర్ కమ్ముల సాయి పల్లవిల కాంబినేషన్, సారంగ దరియా పాట తీసుకొచ్చిన హైప్ లవ్ స్టోరీ అంచనాలను మాములుగా పెంచలేదు. ఒకవేళ అక్టోబర్ ని కూడా వదులుకుంటే పెట్టుబడి భారం దీని మీద పడే అవకాశం లేకపోలేదు. చూద్దాం ఏం చేయబోతున్నారో

Also Read : పవన్ బ్లాక్ బస్టర్ మళ్ళీ విడుదల

Jojobet Girişgrandpashabetcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbetjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabet