iDreamPost
android-app
ios-app

ఇంకెన్ని రామాయణాలు వస్తాయో

  • Published Jul 01, 2021 | 1:44 PM Updated Updated Jul 01, 2021 | 1:44 PM
ఇంకెన్ని రామాయణాలు వస్తాయో

ఇప్పుడంతా రామాయణం సీజన్ నడుస్తోంది. దశాబ్దాల తరబడి కొన్ని వందల వేల సార్లు టీవీలో సినిమాల్లో రాముడి గాథని చూసినప్పటికీ దీన్ని మళ్ళీ మళ్ళీ చూపించాలనే ప్రయత్నాలు దర్శక నిర్మాతలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ఆది పురుష్ నిర్మాణంలో ఉన్న సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ కూడా రామ్ సేతు చేస్తున్నాడు. సీతను సెపరేట్ గా చూపించే క్రమంలో ఆల్రెడీ కరీనా కపూర్ ని అడిగారని బాలీవుడ్ టాక్ ఉంది. ఇవి చాలవన్నట్టు తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుని శ్రీరాముడిగా చూపిస్తే ఎలా ఉంటుందన్న ప్రతిపాదనలు ఉన్నట్టుగా తెలుస్తోంది. నిర్మాత మధు మంతెన మాటలు దీనికి బలమిస్తున్నాయి.

రామాయణం మహాభారతం రెండూ భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నామని ఇప్పటిదాకా రాని అద్భుతమైన కాంబినేషన్లు ఇందులో చూస్తారని చెప్పడం బట్టి చూస్తే పాన్ ఇండియా స్థాయిలో ఈ ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువయ్యాయి. రాముడిగా ఇప్పటిదాకా టాలీవుడ్లో ఎన్టీఆర్, శోభన్ బాబు, బాలకృష్ణ తదితరులు చేశారు. సంపూర్ణ రామాయణం, సీతారామకళ్యాణం, భూకైలాస్, శ్రీ రామాంజనేయ యుద్ధం లాంటి ఎన్నో ఎపిక్స్ ఒకప్పుడు చరిత్ర సృష్టించాయి. కానీ ఇప్పుడు తరం మారింది. టెక్నాలజీ పెరిగింది. రామాయణాన్ని కళ్ళు చెదిరే స్థాయిలో ఇంకా గొప్పగా చెప్పే స్థాయికి ఇండియన్ సినిమా ఎదిగింది.

అయితే కెరీర్ లో పాతిక సినిమాలు చేసిన మహేష్ బాబు ఎన్నడూ ఇలాంటి ఇతిహాసాలు, పౌరాణికాలు, చారిత్రాత్మక కథల జోలికి వెళ్ళలేదు. అన్నీ కమర్షియల్ సబ్జెక్టులు ఎన్నుకుంటూ సేఫ్ గేమ్ ఆడారు. ఒకవేళ నిజంగా రాముడిగా కనిపిస్తే అంతకన్నా థ్రిల్ ప్రేక్షకులకు ఇంకేముంటుంది. అయితే మహేష్ దీని గురించి ఎక్కడా చెప్పలేదు కానీ మధు మాటలను బట్టి చూస్తే చాలా పెద్ద స్టార్లే రామాయణంలో భాగం కాబోతున్నారని తెలిసింది. ఎన్ని వందల కోట్లు పెడతారో కూడా వేచి చూడాలి. మహేష్ ప్రస్తుతానికి సర్కారు వారి పాట కాకుండా కమిట్ అయ్యింది రాజమౌళితో సినిమా ఒక్కటే.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişJojobetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişHoliganbet Girişmadridbet girişmadridbetHoliganbet Giriş