iDreamPost
android-app
ios-app

టీవీ కాంబినేషన్ లో ఓటిటి ప్లాన్

  • Published Jun 16, 2021 | 7:48 AM Updated Updated Jun 16, 2021 | 7:48 AM
టీవీ కాంబినేషన్ లో ఓటిటి ప్లాన్

క్రమంగా సినిమా స్టార్లే కాదు బుల్లితెర తారలు యాంకర్లు కూడా ఓటిటి హవాను వాడుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాలు, ఇప్పుడు టీవీ ఛానల్స్ లో జబర్దస్త్ తరహా కామెడీ షోలతో మంచి ఊపుమీదున్న మల్లెమాల సంస్థ త్వరలో ఓ వెబ్ సిరీస్ నిర్మించేందుకు ప్లానింగ్ లో ఉన్నట్టు తెలిసింది. ఇద్దరు మహిళల మధ్య సాగే డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందించబోతున్నట్టు సమాచారం. ఆ ఇద్దరు ఒకరు అనసూయ మరొకరు రష్మీ గౌతమ్ అని అప్ డేట్. ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ టాక్స్ ఆల్మోస్ట్ అయ్యాయని అంతా సెట్ చేసుకున్నాక అధికారికంగా బయటికి చెప్తారని ఇన్ సైడ్ న్యూస్.

ఇప్పటిదాకా టీవీలోనే కలిసి కనిపించిన అనసూయ, రష్మీలు వెబ్ సిరీస్ ను షేర్ చేసుకోవడం అంటే విశేషమే. సినిమాల్లో చూస్తే అనసూయ స్థాయిలో రష్మీకి క్యారెక్టర్లు దొరకలేదు. రంగస్థలం, క్షణం లాంటి సూపర్ హిట్లు అనసూయకు ఇప్పటికీ మంచి అవకాశాలు తెస్తూనే ఉన్నాయి. అల్లు అర్జున్ పుష్ప, విజయ్ సేతుపతి సినిమా, రవితేజ ఖిలాడీ లాంటి ప్రోజెక్టులతో అనసూయ మాములు బిజీగా లేదు. కానీ ఎటొచ్చి గుంటూరు టాకీస్ లాంటి సక్సెస్ ఫుల్ మూవీ చేసినా రష్మీకి ఎలాంటి బ్రేక్ రాలేదు. పైపెచ్చు తక్కువ బడ్జెట్ సినిమాలు చేసి వాటి రూపంలో ఫ్లాపులు ఎదురుకుని ఆఫర్లు తగ్గించుకుంది.

ఇదేమి భీభత్సమైన కాంబినేషన్ కాదు కానీ టివిని విపరీతంగా చూసే సగటు ప్రేక్షకులకు ఈ కలయిక వల్ల వెబ్ సిరీస్ మీద ఆసక్తి రేగే అవకాశాలు ఉన్నాయి. దర్శకుడు ఎవరు ఎన్ని ఎపిసోడ్లు ఉంటాయనే వివరాలు రాలేదు కానీ మొత్తానికి ఇది అంతో ఇంతో ఆసక్తి కలిగించే విషయమే. ఇప్పుడు ఆర్టిస్టులకు సినిమా, టీవీనే కాక ఓటిటి రూపంలో మూడో కెరీర్ దొరికింది. సరిగ్గా క్లిక్ అయ్యారా ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు. పైగా ఫ్యామిలీ మ్యాన్ లాంటి సిరీస్ లు వచ్చాక వీటికి కూడా కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టొచ్చనే నమ్మకం నిర్మాతల్లో కలుగుతోంది. మరి ఇక్కడ చెప్పిన కాంబో ఎలాంటి సిరీస్ తో వస్తుందో

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişHoliganbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişHoliganbet Girişmadridbet güncel girişmadridbet