iDreamPost
android-app
ios-app

సుస్మితా సేన్, లలిత్ మోడీ రహస్య నిశ్చితార్థం?

  • Published Jul 15, 2022 | 12:40 PM Updated Updated Jul 15, 2022 | 12:40 PM
సుస్మితా సేన్, లలిత్ మోడీ రహస్య నిశ్చితార్థం?

తాను, సుస్మితా సేన్ డేటింగ్ చేస్తున్నాం. త్వరలో పెళ్లి కూడా చేసుకోవచ్చని లలిత్ మోడీ చెప్పేశారు. పెళ్లి అన్న‌మాట ల‌లిత్ మోడీ నోటి వెంట వ‌చ్చిదంటే దాన‌ర్ధం, సుస్మిత సేన్, లలిత్ మోడీలిద్ద‌రూ రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారనే అని, సోష‌ల్ మీడియా చెప్పేస్తోంది.

ఒక‌నాటి విశ్వ‌సుంద‌రి సుస్మితా సేన్ , విదేశాల్లో త‌ల‌దాచుకున్న‌ లలిత్ మోడీ ప్రేమ‌లోప‌డింద‌న్న ఫోటో సాక్ష్యం ఇంటర్నెట్‌లో తుఫాను రేపింది. త‌న‌క‌న్నా చిన్న‌వాడు, మాజీ ప్రియుడు రోహ్మాన్ షాల్‌తో విడిపోతున్నట్లు ప్రకటించిన త‌ర్వాత‌, మాజీ ఐపిఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ తమ అనుబంధాన్ని బైట‌పెట్ట‌డం చాలా మందికి ఫ్యాన్స్ న‌చ్చిన‌ట్లులేదు. సెల‌బ్రిటీ ప్ర‌పంచంలో ఇది చాలా సాధార‌ణం.

సుస్మితా సేన్ తాజా బ్రేకప్ గురించి, లలిత్ మోడీ ఎంత హుషారుగా రియాక్ట్ అయ్యాడో, ఇంటర్నెట్ తవ్వి తీస్తోంది. సుస్మిత సేన్ ను తన బెటర్ హాఫ్ అని పిలుస్తూ ఫోటోల‌ను షేర్ చేశాడు లలిత్ మోడీ. ప్రేమ అంటే వివాహం అని అర్థం కాదు. కానీ దేవుడి దయ వల్ల ఒకటి జరుగుతుంది. మేం కలిసి ఉన్నామని నేను ఇప్పుడే ప్రకటిస్తున్నాన‌ని అన్నాడు ల‌లిత్ మోడీ.

View this post on Instagram

A post shared by Lalit Modi (@lalitkmodi)

తాము డేటింగ్ చేస్తున్నామ‌ని, అయితే త్వరలో పెళ్లి కూడా చేసుకోవచ్చని ల‌లిత్ మోడీ తేల్చిచెప్పేశాడు. ఇప్పుడు లలిత్ మోడీ షేర్ చేసుకున్న ఫోటోల్లో, సుస్మిత తన వేలికి పెద్ద‌ ఉంగరాన్ని చూపిస్తోందంటే, ఇద్ద‌రూ రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారనే అనుకోవాలి. ఈ కొత్త క‌పుల్ కి రణవీర్ సింగ్ నుంచి ఫరా అలీ ఖాన్ వరకు చాలా మంది బాలీవుడ్ సెల‌బ్రిటీలు విషెస్ చెబుతున్నారు.

విశ్వ‌సుంద‌రి చేతిని అందుకొని, గాల్లో ఉన్న‌ట్లు ఫీల‌వుతున్న‌ 56 ఏళ్ల బిజినెస్ మేన్ ల‌లిత్ మోడీ, 46 ఏళ్ల మాజీ మిస్ యూరివ‌ర్స్ ను పెళ్లి చేసుకోవాల‌నుకొంటున్నారు. త్వరలో ఈ జంట నుండి వెడ్డింగ్ ఇన్విటేష‌న్ మ‌న‌కు రావ‌చ్చు.

2010లోనే సుస్మిత‌, ల‌లిత్ మోడీలిద్ద‌రూ డేటింగ్ చేస్తున్న‌ట్లు బాలీవుడ్ లో గాసిప్ న‌డిచింది. కాని ఇద్ద‌రూ బైట‌పెట్ట‌లేదు. ఐపీఎల్ నుంచే ఇద్ద‌రి మ‌ధ్య క్లోజ్ నెస్ ఉంది. ఈ సంగ‌తి ఆనాటి క్రికెట‌ర్ల‌కు తెలుసు. ఐపీఎల్ పార్టీల్లో ల‌లిత్ మోడీ ప‌క్క‌న సుస్మిత కుర్చొనేది. ఇద్ద‌రూ క‌ల‌సి టైంను స్పెండ్ చేసేవాళ్లు. ఇప్పుడు ల‌లిత్ మోడీ త‌మ అనుబంధాన్ని ప్ర‌క‌టించ‌డంతో ట్విట్ట‌ర్ చెల‌రేగిపోతోంది. ఇన్ స్టాగ్రామ్ లో వాళ్ల ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap