iDreamPost
android-app
ios-app

షాకింగ్ : బాలుడిని కాటువేసిన కొద్దిసేపటికే చనిపోయిన పాము

  • Published Jun 23, 2022 | 2:37 PM Updated Updated Jun 23, 2022 | 2:37 PM
షాకింగ్ : బాలుడిని కాటువేసిన కొద్దిసేపటికే చనిపోయిన పాము

పాము కాటు వేస్తే మనిషి చనిపోవడం చాలాసార్లు విని ఉంటారు.. చూసి ఉంటారు.. కానీ మనిషిని కాటేసిన కొద్దిసేపటికే పాము చనిపోవడం చూశారా ? ఇలాంటి సన్నివేశం వినయ విధేయ రామ సినిమాలో కనిపిస్తోంది. అది రీల్. కానీ.. రియల్ గానే అలాంటి ఘటన జరిగింది. ఓ బాలుడిని కాటు వేసిన కొద్దిసేపటికే ఆ పాము చనిపోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ వింత ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. మధోపుర్ గ్రామానికి చెందిన రోహిత్ కుశ్వాలాకు అనూజ్ కుమార్ అనే కొడుకు ఉన్నాడు. అనూజ్ తన తల్లితో కుచాయ్ కోట్ లో ఉన్న అమ్మమ్మ ఇంటివద్ద ఉంటున్నాడు. రోజూ లాగానే అనూజ్ ఇంటిముందు ఆడుకుంటుండగా.. ఒక విషపు పాము బాలుడిని కాటు వేసింది.

అనూజ్ ఏడుస్తూ ఇంటికెళ్లి.. తనను పాము కాటువేసిందని తల్లికి చెప్పాడు. కంగారు పడిన కుటుంబ సభ్యులు అనూజ్ ను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు.. అతను ఆరోగ్యంగానే ఉన్నాడని, ప్రాణానికి ప్రమాదమేమీ లేదని తెలిపారు. కాగా.. బాలుడు అనూజ్ ను కాటు వేసిన కొద్దిసేపటికే ఆ పాము చనిపోవడం.. అక్కడున్న వారందరినీ షాక్ కు గురిచేసింది. స్థానికులు ఆ పామును ఒక డబ్బాలో వేసి అధికారులకు అందజేశారు. పాము కాటు వేసినా.. అనూజ్ ఆరోగ్యంగా ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ బాలుడిని కాటు వేయగానే పాము ఎందుకు చనిపోయింది ? పాము కాటుకు గురైన అనూజ్ ఆరోగ్యంగానే ఎలా ఉన్నాడు ? అన్న ప్రశ్నలు అందరిలోనూ మెదులుతున్నాయి.

 

Jojobet GirişjojobetcasibomjojobetcasibomcasibomStarzbetMadridbetbetcio güncelmatbet girişmeritkingjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişJojobetPoliwinGrandpashabetGrandpashabetcasibomjojobetCasibom Güncel Giriş