iDreamPost
android-app
ios-app

ఒక్క లైగర్ – పధ్నాలుగు లేడీ ఫైటర్స్

  • Published Jul 25, 2022 | 3:47 PM Updated Updated Dec 26, 2023 | 6:04 PM

వాటిలో విజయ్ దేవరకొండ నా తాతలు తండ్రులు ఎవరూ తెలియకపోయినా సపోర్ట్ చేస్తున్నారని అభిమానులను ఉద్దేశించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ట్రైలర్ కు మాస్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

వాటిలో విజయ్ దేవరకొండ నా తాతలు తండ్రులు ఎవరూ తెలియకపోయినా సపోర్ట్ చేస్తున్నారని అభిమానులను ఉద్దేశించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ట్రైలర్ కు మాస్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఒక్క లైగర్ – పధ్నాలుగు లేడీ ఫైటర్స్

వచ్చే నెల 25న విడుదల కాబోతున్న లైగర్ కోసం యూనిట్ భీభత్సమైన ప్రమోషన్లు చేస్తోంది. ఆల్రెడీ ముంబై హైదరాబాద్ లలో భారీ ఎత్తున ట్రైలర్ లాంచ్ ఈవెంట్లు చేశారు. వాటిలో విజయ్ దేవరకొండ నా తాతలు తండ్రులు ఎవరూ తెలియకపోయినా సపోర్ట్ చేస్తున్నారని అభిమానులను ఉద్దేశించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ట్రైలర్ కు మాస్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా తల్లి పాత్రలో రమ్యకృష్ణని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయడం వర్కౌట్ అయ్యేలా ఉంది. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయిలో జయసుధ పాత్ర స్వభావానికి పూర్తి విరుద్ధంగా దీన్ని డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఇక అసలు విషయానికి వస్తే లైగర్ కు సంబంధించిన కొన్ని లీకులు ఫ్యాన్స్ ని బాగా ఎగ్జైట్ చేసేలా ఉన్నాయి. అందులో ఒకటి ప్రీ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్. 14 మంది మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందిన అమ్మాయిలతో విజయ్ దేవరకొండ ఫైట్ ఒకటి ఓ రేంజ్ లో షూట్ చేశారట దర్శకుడు పూరి జగన్నాధ్. ఇదయ్యాకే మైక్ టైసన్ తో క్లైమాక్స్ హోరాహోరీగా ఉంటుందని తెలిసింది. వీళ్ళను ప్రత్యేకంగా విదేశాల నుంచి తీసుకొచ్చి ముంబైలో షూట్ చేశారట. స్క్రీన్ మీద ఓ రేంజ్ గూస్ బంప్స్ ఇచ్చేలా ఇది వచ్చిందని ఇన్ సైడ్ టాక్. ఇలాంటివి ఓ నాలుగైదు పోరాట సన్నివేశాలు అంచనాలకు అతీతంగా సాగుతాయని సమాచారం,

లైగర్ థియేట్రికల్ బిజినెస్ ని చాలా భారీ రేట్లకు అమ్మబోతున్నారట. ఒక్క నైజామ్ నే 30 కోట్లకు కోట్ చేసినట్టు తెలిసింది. ఇది మరీ ఎక్కువ కావడంతో ఇంకా డిస్ట్రిబ్యూటర్ల తరఫున డీల్ క్లోజ్ కాలేదని వినికిడి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే వంద కోట్ల దాకా టార్గెట్ పెట్టుకున్నట్టు వినిపిస్తోంది. అయితే విజయ్ దేవరకొండకు ఎంత ఇమేజ్ ఉన్నా గత వైఫల్యాలు డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ ల ఫలితాలు ఇప్పుడు కొంత ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అయినా పూరి బ్రాండ్ ఇక్కడ హెల్ప్ అవుతోంది. అందులోనూ మార్కెటింగ్ చేయడంలో దిట్ట అయినా విజయ్ టీమ్ తో పాటు ఛార్మీ పూరి టీమ్ చేతులు కలిపాయి. ఇక హైప్ కి హద్దులు ఎక్కడ ఉంటాయి

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/