iDreamPost
android-app
ios-app

వెంకటేష్ 75కి రంగం సిద్ధం

  • Published Dec 14, 2022 | 8:46 PM Updated Updated Dec 14, 2022 | 9:09 PM
వెంకటేష్ 75కి రంగం సిద్ధం

విక్టరీ వెంకటేష్ త్వరలో డెబ్భై అయిదో సినిమా ల్యాండ్ మార్క్ కి దగ్గర కాబోతున్నారు. దీన్ని ఎవరు హ్యాండిల్ చేస్తారనే దాని మీద రకరకాల ఊహాగానాలు జరిగినప్పటికీ ఫైనల్ గా హిట్ 1 అండ్ సెకండ్ కేస్ లను సక్సెస్ ఫుల్ గా డీల్ చేసిన శైలేష్ కొలనుకి అంగీకారం తెలిపినట్టు సమాచారం. గతంలో తరుణ్ భాస్కర్ పేరు వినిపించింది కానీ కథ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అతను కీడా కోలాకు షిఫ్ట్ అయ్యాడు. హిట్ రెండు భాగాలను డీల్ చేసిన తీరు చూసి ఇంప్రెస్ అయిన వెంకీ ఇటీవలే శైలేష్ ని ఆఫీస్ కి పిలిచి ప్రత్యేకంగా అభినందించడం తెలిసిందే. ఈ సందర్భంగానే ఇద్దరి మధ్య కథకు సంబంధించిన చర్చలు జరిగాయని తెలిసింది

వెంకటేష్ త్వరలో ఓ లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్నారు. ఈ ఏడాది ఎఫ్3 సూపర్ హిట్ ఆయన ఖాతాలో ఉంది. స్పెషల్ క్యామియో చేసిన ఓరి దేవుడా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా విశ్వక్ సేన్ హీరో కాబట్టి ఇది పరిగణించాల్సిన పని లేదు. వెంకీ విదేశాల నుంచి తిరిగి వచ్చేలోగా శైలేష్ ఫైనల్ వెర్షన్ ని సిద్ధం చేసి వినిపించబోతున్నాడు. కంప్లీట్ యాక్షన్ జానర్ గా ఆ మధ్య కమల్ హాసన్ చేసిన విక్రమ్ తరహాలో స్టైలిష్ గా ఉంటుందట. హీరోయిన్ తో ఆడిపాడటాలు, ఐటెం సాంగులు, ఓవర్ బిల్డప్ హీరోయిజం ఎలివేషన్లు లాంటివి లేకుండా ఒక డిఫరెంట్ సబ్జెక్టు ఎంచుకున్నట్టు తెలిసింది. ఇంకా స్క్రిప్ట్ స్టేజిలోనే ఉంది కాబట్టి క్యాస్టింగ్ తదితరాలు ఫైనల్ చేయలేదు

తన సమకాలీకులు చిరు బాలయ్య నాగ్ లకు భిన్నంగా వెంకీ ప్లానింగ్ కనిపిస్తోంది. అభిమానులు త్వరలో విడుదల కాబోతున్న నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ రానా నాయుడు కోసం ఎదురు చూస్తున్నారు. షూటింగ్ ఎప్పుడో పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం జరగడంతో పాటు ఏ అకేషన్ లో స్ట్రీమింగ్ చేయాలనే దాని మీద ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. క్రిస్మస్ న్యూ ఇయర్ అయితే కాదు. బాబాయ్ అబ్బాయ్ అరుదైన కాంబోలో ఎంజాయ్ చేసేందుకు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఫైనల్ గా వెంకటేష్ వంద సినిమాలు చేస్తారో లేదో తెలియదు కానీ ఈ సెవెంటీ ఫైవ్ మాత్రం నెవర్ బిఫోర్ తరహాలో స్పెషల్ గా ఉండాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alKulisbetKulisbetberlinbetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş