iDreamPost
android-app
ios-app

ఏదో ఒకటి తేల్చమంటున్న ఫ్యాన్స్

  • Published Jul 07, 2021 | 8:20 AM Updated Updated Jul 07, 2021 | 8:20 AM
ఏదో ఒకటి తేల్చమంటున్న ఫ్యాన్స్

గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వెంకటేష్ అభిమానులు చేస్తున్న హంగామా అంతా ఇంత కాదు. నారప్ప ఓటిటిలో రాబోతోందన్న వార్తలు వచ్చినప్పటి తమ నిరసనను రకరకాల రూపంలో ప్రకటించడం మొదలుపెట్టారు. నిన్న సాయంత్రం 4 గంటలకు ఏదో కీలకమైన అప్ డేట్ ఉంటుందన్న న్యూస్ తెలియడం ఆలస్యం దాని కోసం తెగ ఎదురు చూశారు. థియేట్రికల్ రిలీజ్ అనౌన్స్ మెంట్ ఉంటుందన్న ఆశతో కొందరు ఓటిటి కన్ఫర్మ్ చేస్తారని మరికొందరు ఇలా రకరకాల చర్చలు జరిగాయి. కట్ చేస్తే నాలుగు కాదు కదా అసలు నిన్నంతా ఎలాంటి సమాచారం లేదు. సాంకేతిక సమస్యని కొందరు ఫ్యాన్స్ సర్దిచెప్పుకున్నారు.

అసలు తెరవెనుక నారప్పకు ఏం జరుగుతోందన్న అనుమానం మాత్రం అందరిలోనూ ఉంది. ఇన్ సైడ్ సోర్స్ నుంచి వినిపిస్తున్న సమాచారం మేరకు నిర్మాత సురేష్ బాబు నిజానికి ప్రైమ్ కే నారప్పను ఇచ్చారట. ఆ మేరకు ముందస్తు ఒప్పందం కూడా జరిగిందట. అయితే అభిమానుల నుంచి ఈ స్థాయి వ్యతిరేకత ఊహించకపోవడం కొంత ప్రభావం చూపించింది. దానికి తోడు కొద్దిరోజుల క్రితం వేసిన సీక్రెట్ ప్రీమియర్ చూసిన వాళ్ళు ఇది థియేటర్ అయితేనే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేయడంతో మళ్ళీ పునరాలోచనలో పడ్డట్టు కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. ఇందులో నిజమెంతుందో దేవుడికే ఎరుక

ఇదంతా ఒక ఎత్తైతే నిన్న మణికొండలో వెంకీ ఫ్యాన్స్ ధర్నా చేస్తున్నారన్న వార్త కూడా కలకలం రేపింది. కాకపోతే కాసేపు చేసి వెళ్లిపోయారట. ఇవన్నీ గమనిస్తూ ఉంటే నారప్ప మీద ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతోంది. అయితే ప్రైమ్ తో డీల్ చేసుకుని సైన్ చేశాక డ్రాప్ అయితే నష్టం ఎక్కువగా ఉంటుందని కూడా అంటున్నారు. మరి సురేష్ బాబు నిజంగా రిస్క్ చేసి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి నారప్పను వెండితెరపైకి తీసుకొస్తారా లేక బిజినెస్ కోణంలో ఆలోచించి ఓటిటికి కట్టుబడతారా అనేది వేచి చూడాలి. ప్రియమణి వెంకీకి జంటగా నటించిన నారప్పకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించగా మణిశర్మ సంగీతం సమకూర్చారు

Jojobet GirişMadridbetMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş